తేజ సజ్జా 'మిరాయ్'.. మళ్ళీ ఆలస్యమేనా?
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా.. బ్లాక్ బస్టర్ హిట్ హనుమాన్ మూవీ తర్వాత మిరాయ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 8 Feb 2025 9:30 AM GMTటాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా.. బ్లాక్ బస్టర్ హిట్ హనుమాన్ మూవీ తర్వాత మిరాయ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఆ మూవీలో అశోక వనంలో అర్జున కళ్యాణం ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది.
అశోక చక్రవర్తి రహస్యంగా దాచిన తొమ్మిది గ్రంథాల నేపథ్యంలో తెరకెక్కుతున్న మిరాయ్ లో వాటిని సంరక్షించే యోధుడిగా తేజ సజ్జా కనిపించనున్నారు. అదే సమయంలో గ్రంథాలను దక్కించుకుని భగవంతుడిగా మారాలనుకునే బ్లాక్ స్వార్డ్ పాత్రలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కనిపించనున్నారు.
అయితే చెడుకు, మంచికి జరిగే మధ్య యుద్ధమే సినిమా అన్నట్లు ఇప్పటికే గ్లింప్స్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. సినిమాపై కొద్ది రోజుల క్రితం మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్.. మంచి బజ్ క్రియేట్ చేసింది. యుద్ధాలు, యాక్షన్ సీక్వెన్స్ లు, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పించందనే చెప్పాలి.
ఇప్పుడు మూవీకి సంబంధించిన స్పెషల్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గా అండర్ వాటర్ సీక్వెన్స్ షూటింగ్ కంప్లీట్ అయిందని తెలుస్తోంది. మరో 30 రోజుల షూటింగ్ పెండింగ్ ఉందని సమాచారం. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు మిగతా పనులు మేకర్స్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.
అదే సమయంలో మూవీ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేయనున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. జూలై 4న విడుదల చేయాలని యోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. నిజానికి ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ చేస్తామని.. మేకర్స్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. పాన్ ఇండియా లెవెల్ లో మూవీని తీసుకొస్తామని అనౌన్స్ చేశారు.
కానీ పెండింగ్ వర్క్ ను ఇప్పుడు దృష్టిలో పెట్టుకుని కొత్త రిలీజ్ డేట్ వైపు చూస్తున్నారని సమాచారం. అయితే మిరాయ్ లో జగపతి బాబు, శ్రియ శరన్, జయరామ్, రాజేంద్రనాథ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మరి మిరాయ్ మూవీ అనుకున్న తేదీకి రిలీజ్ అవుతుందా? లేక పోస్ట్ పోన్ అవుతుందా అనేది వేచి చూడాలి.