Begin typing your search above and press return to search.

తేజ.. ఇంతకంటే మంచి ఛాన్స్ ఉండదేమో?

ఆ మూవీ తర్వాత తేజ సజ్జ.. మహేశ్ బాబు రాజకుమారుడు చిత్రంలో నటించారు.

By:  Tupaki Desk   |   6 Jan 2024 10:30 AM GMT
తేజ.. ఇంతకంటే మంచి ఛాన్స్ ఉండదేమో?
X

ఒకప్పుడు చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గా ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన తేజ సజ్జ ఇప్పుడు హీరోగా హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయారు. చూడాలని ఉంది అనే చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తేజ.. అందులో చిరంజీవికి కొడుకుగా కనిపించి మెప్పించారు. ఆ మూవీ తర్వాత తేజ సజ్జ.. మహేశ్ బాబు రాజకుమారుడు చిత్రంలో నటించారు.

ఆ తర్వాత కలిసుందాం రా, గంగోత్రి, ఛత్రపతి, శ్రీరామదాసు వంటి సినిమాల్లో నటించారు. ఆ మధ్య పెద్దగా అయ్యాక ఓ బేబీ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించారు. ఇక హీరోగా తేజ జాంబిరెడ్డి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మూవీ ఇచ్చిన ఫుల్ జోష్ తో ఇప్పుడు హనుమాన్ చిత్రంలో నటించి సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు.

సూపర్ హీరో సిరీస్‌గా ఫిక్ష‌న‌ల్ నేప‌థ్యంలో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. అయితే ఈ సినిమాతో తేజ సజ్జ.. నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించారు. నార్త్ లో ఈ మూవీ.. 1000కి పైగా థియేటర్లలో రిలీజ్ అవుతుందంటే ఆషామాషీ కాదు. పక్కా 100 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకునే ఛాన్స్ ఇది. సంక్రాంతి టైమ్ లో ఈ సినిమాకి మాంచి టాక్ వచ్చి జనాలకు నచ్చితే బ్లాక్ బస్టర్ హిట్ కావడం పక్కా.

ఈ సినిమా రిలీజ్ కాకుండానే.. తేజ సజ్జ మరో సూపర్ ఛాన్స్ కొట్టేశారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. క్రేజీ మల్టీస్టారర్ లో నటించనున్నారని తెలుస్తోంది. రవితేజ ఈగల్ సినిమా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించనున్న సినిమాలో లీడ్ రోల్ ఛాన్స్ కొట్టేశారట తేజ. ఈ మూవీలో మంచు మనోజ్, దుల్కర్ సల్మాన్ లు కూడా నటించనున్నారట.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఈఏడాదిలోనే మూవీ రిలీజ్ చేయనున్నారట. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుందట. అయితే పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న తేజ హనుమాన్ తో హిట్ కొడితే.. కుర్రాడి రేంజ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు.

ఆ తర్వాత ఆయన నటించే కొత్త సినిమాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది. మంచి బిజినెస్ కూడా చేస్తాయి. తేజ సజ్జాకు ఒక విధంగా 2024 చాలా కీలకం కానుంది. హనుమాన్ బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్లు క్రియేట్ చేసేలా హైప్ అయితే సెట్ చేసికుంది. ఇక కేవలం టాక్ మీద సినిమా ఆధారపడి ఉంది. మరో ఈ ఏడాది అతని కెరీర్ ఎలాంటి యూ టర్న్ తీసుకుంటుందో చూడాలి.