సూపర్ హీరో చిన్న వయసులోనే రాటుదేలాడు!
యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు పాన్ ఇండియాలో ఓ సంచలనం. `హనుమాన్` 250 కోట్ల వసూళ్లు సాధించ డంతో తేజ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.
By: Tupaki Desk | 30 Jan 2024 4:30 PM GMTయంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు పాన్ ఇండియాలో ఓ సంచలనం. `హనుమాన్` 250 కోట్ల వసూళ్లు సాధించ డంతో తేజ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని వాళ్లు కూడా గెస్ చేసి ఉండరు. ఇప్పుడు తేజ పేరెత్తితే అతన్నో సూపర్ హీరోగా అభివర్ణిస్తున్నారు. మరి ఈ యంగ్ హీరో భవిష్యత్ కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాడు? అన్నది సస్పెన్స్. ఇకపై తన సినిమాలన్ని పాన్ ఇండియాలో రిలీజ్ అయ్యే కాన్సెప్ట్ లతోనే వస్తాడా? లేక రీజనల్ మార్కెట్ పై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తాడా? అన్నది చూడాలి.
ఇక తేజ ఎంతో బ్యాలెన్స్డ్ అండ్ మెచ్యూర్డ్ పర్సన్ అని చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పరిస్థితిని అయినా చాకచక్యంగా డీల్ చేయగలిగే సామర్ధ్యం ఉన్న వాడని హనుమాన్ ప్రమోషన్ కార్యక్రమాల్లోనే అర్ధమైంది. అతడిపై నెగిటివ్ కామెంట్లుకు తెలివైన సమాధానం ఇచ్చాడు. తను గానీ.. తన అభిమానులు గానీ ఎవరూ హర్ట్ కాకుండా ప్రశ్న అడిగిన వాళ్లనే తిరిగి ప్రశ్న వేసి తనదైన శైలిలో బధులివ్వడం.. తొడ కొట్టామంటే కొట్టకుండా అతడు ఇచ్చిన సమాధానం..మీడియాతో అతను ఇంటరాక్ట్ అయిన విధానం ప్రతీది తేజ ఎంత పరిణితి చెందాడు అనడానికి ఉదాహరణగా చెప్పొచ్చు.
`హనుమాన్` తో తనకు వచ్చిన స్టార్ డమ్ ని అంతే తెలివిగా బ్యాలెన్స్ చేస్తున్నాడు. విజయం వచ్చిందని పొంగిపోలేదు . అపజయం ఎదురైన నాడు కృంగిపోలేదు. అన్ని వేళలా ఒకేలా ఉండాలని అతడి ప్రవర్తనా తీరును బట్టి చెప్పొచ్చు. అలాగే ప్రశంసల్ని.. విమర్శలి కూడా ఎంతో బ్యాలెన్స్ చేయగలిగాడు. అయితే ఇదంతా అతడిలో అప్పటికప్పుడు వచ్చిన మార్పు కాదు. తేజ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
చిన్న నాటి నుంచి సినిమా వాతావరణంలో పెరిగాడు. కెమెరా..యాక్షన్...ప్యాకప్ అనే పదాలు మూతిపై మీసాలు రాని వయసులోనే చదివేసాడు. ఇండస్ట్రీలో ఎలా ఉండాలో బ్యాకెండ్ లో మంచి గైడెన్స్ చిన్న నాటి నుంచే అలవాటు అయింది. ఆ అనుభవం ఇప్పుడెంతో ఉపయోగపడుతుంది. భవిష్యత్ లో మంచి స్టార్ అవుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి తేజ నెక్స్ట్ ఏ సినిమాతో వస్తాడు? అన్నది సస్పెన్స్.