Begin typing your search above and press return to search.

సంక్రాంతికి మిరాయ్ వస్తే ఏం జరుగుతుంది..?

సూర్య వర్సెస్ సూర్య తర్వాత కంప్లీట్ గా ఫుల్ టైం కెమెరామెన్ గా మారిన కార్తీక్ ని మళ్లీ మెగా ఫోన్ పట్టుకునేలా చేశారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

By:  Tupaki Desk   |   21 Jun 2024 12:30 AM GMT
సంక్రాంతికి మిరాయ్ వస్తే ఏం జరుగుతుంది..?
X

సూర్య వర్సెస్ సూర్య తర్వాత కంప్లీట్ గా ఫుల్ టైం కెమెరామెన్ గా మారిన కార్తీక్ ని మళ్లీ మెగా ఫోన్ పట్టుకునేలా చేశారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మాస్ మహరాజ్ రవితేజతో ఈగల్ సినిమాతో ఆఫ్టర్ గ్యాప్ కార్తీక్ డైరెక్షన్ చేశాడు. ఐతే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఐతే కార్తీక్ తో పీపుల్ మీడియా భారీ ప్లానింగ్ తోనే వచ్చారు. ఈగల్ రెండు భాగాలుగా అనుకోగా ఈగల్ సక్సెస్ అవ్వకపోవడంతో ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టి మిరాయ్ అంటూ మరో ప్రాజెక్ట్ తో వస్తున్నారు.

హనుమాన్ తో పాన్ ఇండియా సూపర్ హిట్ అందుకున్న తేజా సజ్జ లీడ్ రోల్ లో మంచు మనోజ్ నెగిటివ్ రోల్ లో ఈ సినిమా వస్తుంది. మిరాయ్ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది రుచి చూపించారు. ఈ సినిమాతో మరోసారి నేషనల్ లెవెల్ లో బాక్సాఫీస్ ని షేక్ చేయాలని ఫిక్స్ అయ్యారు. మిరాయ్ సినిమా అసలైతే ఏప్రిల్ 18 2025న రిలీజ్ లాక్ చేశారు. కానీ సినిమా సంక్రాంతి రేసులో దించితే ఎలా ఉంటుంది అన్న డిస్కషన్స్ మొదలయ్యాయి.

తేజా సజ్జ తో చేసిన హనుమాన్ సినిమా సంక్రాంతికి వచ్చి అద్భుతాలు సృష్టించింది. ఆ సెంటిమెంట్ ప్రకారం మిరాయ్ ని కూడా సంక్రాంతికి తెస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఐతే ఆల్రెడీ పొంగల్ రేసులో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర వస్తుంది. దానితో పాటుగా రవితేజ 75వ సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ అంటున్నారు. పవన్ హరి హర వీరమల్లు సినిమా కూడా పొంగల్ రేసులో ఉంటుందని టాక్. ఈ సినిమాలతో పాటుగా తేజా సజ్జా మిరాయ్ వస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

రవితేజ 75వ సినిమాను కూడా పీపుల్ మీడియా నిర్మిస్తుంది. సో వాళ్లవే రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వవు కాబట్టి మిరాయ్ వస్తే మాత్రం రవితేజ సినిమా మళ్లీ వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ మాస్ రాజా సినిమానే సంక్రాంతికి తెచ్చి మిరాయ్ ని ముందు అనుకున్నట్టుగా ఏప్రిల్ లో రిలీజ్ చేసినా చెయ్యొచ్చు. మిరాయ్ టీజర్ మాత్రం సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా చూసేద్దాం అన్న ఎగ్జైట్మెంట్ కలిగించింది. మరి సినిమా కూడా ఆ రేంజ్ లో ఉంటుందా లేదా అన్నది చూడాలి.