Begin typing your search above and press return to search.

తేజ సజ్జా.. నెక్స్ట్ హిట్టు చాలా ముఖ్యం బిగిలు

హనుమాన్' సక్సెస్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు తేజ సజ్జ. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంది.

By:  Tupaki Desk   |   24 Jan 2024 7:46 AM GMT
తేజ సజ్జా.. నెక్స్ట్ హిట్టు చాలా ముఖ్యం బిగిలు
X

హనుమాన్' సక్సెస్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు తేజ సజ్జ. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్నిచోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో అదరగొడుతోంది ఇప్పటికే 200 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ స్థాయిలో వసూలు అందుకుంటున్న ఈ సినిమాలో తేజ సజ్జా తన యాక్టింగ్ తో అదరగొట్టేసాడు. దీంతో హీరోగా తేజ సజ్జా కి హనుమాన్ విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.

ఈ క్రమంలోనే ఈ యంగ్ హీరోకి ఇప్పుడు మంచి ఛాన్సులు వచ్చే అవకాశం ఉంది. హనుమాన్ తర్వాత తేజ సజ్జా నటించబోయే సినిమాలపై ఆడియన్స్ లోను మరింత ఆసక్తి నెలకొంది. హనుమాన్ హిట్టుతో తేజ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఈ క్రేజ్ ను అంతను మరొక లెవెల్ కు తీసుకు వెలితేనే తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ అవుతుంది.

ఇక రవితేజ 'ఈగల్' సినిమాను తెరకెక్కిస్తున్న కార్తీక్ ఘట్టమనేనితో తేజ సజ్జా తన నెక్స్ట్ మూవీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు డిఫరెంట్ జానర్ లో ఉంటుందట. ఇప్పటికే తేజతో కొంత షూటింగ్ కూడా ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన 'ఈగల్' ఫిబ్రవరిలో విడుదల కాబోతోంది. ఈ మూవీ తర్వాత కార్తీక్ తేజ సజ్జాతో మిగిలిన షూటింగ్ ని ఫినిష్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ దర్శకుడు ఇదివరకే నిఖిల్ తో సూర్య vs సూర్య అనే సినిమా చేశాడు.

తేజకు కార్తీక్ తో చేస్తున్న సినిమా చాలా ముఖ్యమైంది. హనుమాన్ లాంటి హిట్టుతో హిందీలో కూడా క్రేజ్ వచ్చింది. ఓవర్సీస్ లో 5 మిలియన్ కలెక్షన్స్ వచ్చాయి. కాబట్టి ఆ సినిమా కంటెంట్ కు తగ్గట్టుగా ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. హనుమాన్ క్రేజ్ - అది వచ్చిన టైమింగ్ వేరు కాబట్టి తేజకు కలిసొచ్చింది. అన్ని సినిమాలకు అలాంటి టైమ్ కలిసి రాదు.

200 కోట్ల కలెక్షన్స్ వచ్చినా తేజ తదుపరి సినిమా కంటెంట్ బాగుంటేనే అతనిపై నమ్మకం పెరుగుతుంది. భవిష్యత్తులో కూడా తేజ నుంచి వచ్చే సినిమాలు మినిమమ్ కంటెంట్ తో ఉంటాయని మార్కెట్ లో తనకంటూ ఒక డిమాండ్ ఏర్పడుతుంది. ఇక దర్శకుడు కార్తీక్ మొదటి సినిమా సూర్య vs సూర్య కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాకపోయినా అది అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది.

కాబట్టి అతని కంటెంట్ క్లిక్కయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈగల్ అప్డేట్స్ కూడా చాలా డిఫరెంట్ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. దీంతో తేజతో చేయబోయే సినిమా కూడా మినిమమ్ ఉంటుందని చెప్పవచ్చు. కాకపోతే సినిమాను జనాల్లోకి ఎక్కువగా తీసుకెళ్లే విధంగా కంటెంట్ తో ప్రమోషన్స్ చేయాలి. మరి ఆ సినిమాతో తేజ సజ్జా ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.