Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : బ్లాక్ లో తెలుగమ్మాయి సో బ్యూటీఫుల్‌ సో...!

తాజాగా మరోసారి ఇలా బ్లాక్ డ్రెస్ లో కన్నుల విందు చేసింది. ఓ రేంజ్ లో తేజస్వి అందంగా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 Jan 2024 3:57 AM GMT
పిక్ టాక్ : బ్లాక్ లో తెలుగమ్మాయి సో బ్యూటీఫుల్‌ సో...!
X

తెలుగు అమ్మాయిలు అందాల ఆరబోత విషయంలో ముంబై ముద్దుగుమ్మలకు, మలయాళ ముద్దుగుమ్మలకు ఆమడ దూరంలో ఉంటారనే అభిప్రాయం కొంత మందిలో ఉంది. కానీ ఆ అభిప్రాయంను కొందరు తెలుగు హీరోయిన్స్‌ తప్పు అని నిరూపించేందుకు ప్రయత్నిస్తూ నెటిజన్స్ కి కన్నుల విందు చేస్తున్నారు.


తెలుగు అమ్మాయిలు స్టార్‌ హీరోలకు జోడీగా నటించే ఆఫర్లు దక్కించుకోలేక పోతున్నారు. కానీ సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోయిన్స్‌ కి పోటీ అన్నట్లుగా అందంగా కనిపిస్తూ వారినే డామినేట్ చేసే విధంగా ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. తెలుగు అమ్మాయి తేజస్వి మదివాడ తన అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.


తాజాగా మరోసారి ఇలా బ్లాక్ డ్రెస్ లో కన్నుల విందు చేసింది. ఓ రేంజ్ లో తేజస్వి అందంగా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న తేజస్వి మన ఫిల్మ్‌ మేకర్స్ కి ఎందుకు కనిపించడం లేదు అంటూ చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలిగా మారిన ఈ అమ్మడు వర్మ ఐస్‌ క్రీమ్‌ తో మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. బిగ్ బాస్ లో కూడా సందడి చేసిన ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్లు రావడం లేదు. కానీ నెట్టింట మాత్రం ఈమెకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. ముందు ముందు అయినా ఈమెకు కనీసం సిరీస్ ల్లో అయినా ఛాన్స్ దక్కేనా చూడాలి.