Begin typing your search above and press return to search.

నాన్న ఇచ్చిన ధైర్యం..కాన్పిడెన్స్ తోనే ఇదంతా! తేజ‌స్వీని

న‌ట‌సింహ బాల‌కృష్ణ కుమార్తె తేజ‌స్వీని ఇంత కాలం తెర వెనుకే ఉన్నారు.

By:  Tupaki Desk   |   13 Oct 2024 5:08 AM GMT
నాన్న ఇచ్చిన ధైర్యం..కాన్పిడెన్స్ తోనే ఇదంతా! తేజ‌స్వీని
X

న‌ట‌సింహ బాల‌కృష్ణ కుమార్తె తేజ‌స్వీని ఇంత కాలం తెర వెనుకే ఉన్నారు. డాడ్ బాల‌కృష్ణ హోస్ట్ చేస్తోన్న `అన్ స్టాప‌బుల్` షోకి నిర్మాత‌గా, క్రియేటివ్ డిపార్ట్ మెంట్ లో ప‌నిచేసారు. ఇండ‌స్ట్రీ నుంచి ఎలాంటి అనుభ‌వం లేని తేజ‌స్వీనికి ఇది మంచి ఎక్స్ పీరియ‌న్స్ అందించింది. ఈనేప‌థ్యంలో సోద‌రుడు మోక్ష‌జ్ఞ చిత్రంతో నేరుగా ఇండ‌స్ట్రీకి నిర్మాత‌గా లాంచ్ అవుతున్నారు. ఈ ప్ర‌ణాళిక అంతా న‌ట‌సింహానిదే. ఒకేసారి త‌న‌యుడు, త‌న‌య‌ని లాంచ్ చేసి తానో స్పెష‌ల్ అనిపించారు.

అయితే ఇంత‌వ‌ర‌కూ తేజస్వీని మీడియా ముందుకొచ్చి మాట్లాడింది లేదు. వెనుకుండి వ్య‌వ‌హారాల‌న్ని చ‌క్క‌బెట్ట‌డం త‌ప్ప ఆమ ఎక్క‌డా మాట్లాడింది లేదు. ఈనేప‌థ్యంలో తాజాగా `అన్ స్టాప‌బుల్ సీజ‌న్-4` లాంచింగ్ ఈవెంట్ లో తేజ‌స్వీని ఎంతో చ‌క్క‌గా మాట్లాడారు. నంద‌మూరి ఇంట ఆడ‌బిడ్డ అంటే? ఆ స్పెషాల్టీ ఎలా ఉంటుంద‌ని మ‌రోసారి నిరూపించారు. `ఈ రోజు నాకు చాలా స్పెష‌ల్. తొలిసారి మీ అందరి ముందు కూర్చున్నాను.

అర‌వింద్ అంకుల్ ఈ ఆలోచ‌న నాతోపంచుకున్న‌ప్పుడు అంతా షో చేద్దా? లేదా? అరి ఆలోచించారు. కానీ నాన్న మాత్రం చాలా కాన్పిడెంట్ గా చేయాల్సిందే అన్నారు. నాన్న కార‌ణంగానే ఇది సాధ్య‌మైంది. ఆ ధైర్య‌మే అన్ స్టాప‌బుల్ ని ఈ రేంజ్ లో కూర్చోబెట్టింది. ఐఎండీబీ రేటింగ్స్ లో అన్‌స్టాపబుల్ షో వరల్డ్ లో 18వ ర్యాంక్ వచ్చింది. ఇండియాలో మోస్ట్ పాపులర్ షో అయింది. నాన్న లో కొత్త కోణ‌మే ఈషోని హైలైట్ చేసింది. ఇప్పటికే అన్‌స్టాపబుల్ మూడు సీజన్స్ అయ్యాయి. నాలుగో సీజన్ మరింత గొప్పగా ఉంది. ఎవరూ ఊహించారు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అని తెలిపింది.

అన్‌స్టాపబుల్ అంటే ఛాలెంజెస్ ఎదురైన‌ప్పుడు ధైర్యంగా వారిని తీసుకోవడం, పక్కన ఎవరు ఉంటే వాళ్ళ కోసం నిలబడటం, సమాజం కోసం నిలబడటం. ఇవ‌న్నీ నాన్న గారిలో ఉన్నాయి. ఆయ‌న ఫ్యామిలీ కోసం, ప్రెండ్స్ కోసం ,ప్రజల కోసం నిలబడే వ్యక్తి. ఎమ్మెల్యేగా మూడుసార్లు హ్యాట్రిక్ సాధించారు. ఆయ‌న నియోజ‌క వర్గం గురించి ఎప్పుడూ మాట్లాడతారు. అలాగే క్యాన్స‌ర్ ఆసుప‌త్రిని దేవాల‌యంతో పోల్చుతారు. అందుకు నాన్నకు హ్యాట్సాఫ్` అని అన్నారు. ప్ర‌స్తుతం ఈ స్పీచ్, తేజ‌స్వీని ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. షో గురించి..నాన్న గురించి ఇంత గొప్ప‌గా మాట్లాడిన తేజ‌స్వీని నిర్మాత‌గా డెబ్యూ చిత్రం గురించి ముందు ముందు వేడుక‌ల్లో ఇంకెంత అద్భుతంగా మాట్లాడుతుందో అంటూ అభిమానులు మురిసిపోతున్నారు.