ఓటీటీ అప్‌డేట్... ఆ మూడు స్ట్రీమింగ్ షురూ
ఈ మధ్య కాలంలో థియేటర్ రిలీజ్ సినిమాల కంటే ఓటీటీ రిలీజ్ సినిమా లపై ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
By: Tupaki Desk | 12 Sep 2024 6:19 AM GMTఈ మధ్య కాలంలో థియేటర్ రిలీజ్ సినిమాల కంటే ఓటీటీ రిలీజ్ సినిమా లపై ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్ రిలీజ్ అయ్యి విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలను సైతం ఒక వర్గం ప్రేక్షకులు ఎప్పుడు ఎప్పుడు ఓటీటీలో వస్తుందా.. ఎప్పుడెప్పుడు ఇంట్లోనే ఆ సినిమా చూద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. థియేటర్ కి వెళ్లలేని వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. అలా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్న మూడు క్రేజీ సినిమాలు నేటి నుంచి ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రవితేజ మార్క్ ఎంటర్‌టైన్మెంట్ ఉన్నా కూడా కొన్ని లాజిక్ లేని సన్నివేశాలతో పాటు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకులను థియేటర్ రిలీజ్ లో నిరాశ పరిచింది. అయితే రవితేజకు ఉన్న క్రేజ్, హరీష్ శంకర్ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రపంచంలోకి మిస్టర్ బచ్చన్ వచ్చేశాడు.
నిహారిక కొణిదెల నిర్మాణంలో వచ్చిన మొదటి సినిమా 'కమిటీ కుర్రాళ్ళు'. ఈ సినిమా తో దాదాపు 20 మంది కొత్త వారిని నిహారిక ఇండస్ట్రీకి పరిచయం చేసింది. చిన్న సినిమా, పెద్ద అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమిటీ కుర్రాళ్లు మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి వారం తో పోల్చితే రెండో వారంలో ఎక్కువగా ఈ సినిమాకు కొన్ని ఏరియాల్లో ఆక్యుపెన్సీ దక్కినట్లుగా బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందింది. కమిటీ కుర్రాళ్లు సినిమాకు పెట్టిన మొత్తం బడ్జెట్ కంటే దాదాపుగా డబుల్ వసూళ్లు నమోదు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. థియేటర్ లో హిట్ కొట్టిన కమిటీ కుర్రాళ్లను ఓటీటీ లో చూడాలని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ఈటీవీ విన్ ద్వారా ఈ సినిమా ఓటీటీ కి వచ్చేసింది.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మాణంలో వచ్చిన మరో చిన్న సినిమా 'ఆయ్'. విభిన్నమైన గోదావరి కథ తో రూపొందిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం దక్కింది. చిన్న సినిమా అయినా పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ఎన్టీఆర్ బావమర్ధి అయిన నార్నె నితిన్ కు మరో విజయాన్ని 'ఆయ్' కట్టబెట్టింది. ఆకట్టుకునే కథ, కథనాల వల్ల సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమానూ ప్రేక్షకులు ఓటీటీ లో చూడటం కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు వెయిట్ పూర్తి అయింది. నెట్ ఫ్లిక్స్ లో 'ఆయ్' ను స్ట్రీమింగ్ చేశారు. ఈ వీకెండ్ కి ఈ మూడు సినిమాలు ఓటీటీ ప్రేక్షకులకు విందు భోజనం అనడంలో సందేహం లేదు.