Begin typing your search above and press return to search.

ఎందుకింత మార్పు? కార్తీని చూసైనా నేర్చుకోవచ్చుగా!

కోలీవుడ్ స్టార్ హీరోలు కార్తీ, అరవింద్ స్వామి నటించిన సత్యం సుందరం చిత్రం రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 Oct 2024 4:30 AM GMT
ఎందుకింత మార్పు? కార్తీని చూసైనా నేర్చుకోవచ్చుగా!
X

కోలీవుడ్ స్టార్ హీరోలు కార్తీ, అరవింద్ స్వామి నటించిన సత్యం సుందరం చిత్రం రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. 96 మూవీలో సెన్సిటివ్ లవ్ స్టోరీని మనసులకు హత్తుకునేలా మెప్పించిన ప్రేమ్‌ కుమార్‌.. ఇప్పుడు భావోద్వేగభరిత చిత్రంగా సత్యం సుందరం సినిమా తెరకెక్కించారు. తమిళ, తెలుగులో విడుదలైన ఆ మూవీ.. రెండు భాషల్లోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. డబ్బింగ్ క్వాలిటీ బాగుండడంతో టాలీవుడ్ ఆడియన్స్ ను తెగ నచ్చేసింది!

డబ్బింగ్ వెర్షనే కానీ అచ్చం తెలుగు సినిమాలాగే అనిపించిందని అనేక మంది సినీ ప్రియులు కామెంట్స్ పెట్టారు. సినిమా అంతా తెలుగుదనం ఉట్టిపడిందని కొనియాడారు. ముఖ్యంగా తమిళ వెర్షన్ కు ఎలాంటి సంబంధం లేకుండా అచ్చ తెలుగులో టైటిల్ ఉండడంతో అంతా అట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. టైటిల్స్ విషయంలో కార్తీ మూవీ మేకర్స్ లాగే మిగతా వాళ్లు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.

కొన్నేళ్లుగా కోలీవుడ్ హీరోలు యాక్ట్ చేస్తున్న దాదాపు అన్ని చిత్రాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. కొన్ని నెలల ముందు వరకు.. టాలీవుడ్ డబ్బింగ్ వెర్షన్లకు తెలుగులో టైటిల్స్ పెట్టేవారు మేకర్స్. గజినీ, బాషా వంటి సినిమాలు తప్పితే దాదాపు అన్ని కోలీవుడ్ డబ్డ్ వెర్షన్లకు టైటిల్స్ మార్చారు. కానీ కొంత కాలంగా కోలీవుడ్ మేకర్స్ తమిళ టైటిల్ తోనే తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అజిత్ వలిమై నుంచి త్వరలో రాబోయే రజినీకాంత్ వేట్టయన్ వరకు అదే జరుగుతోంది.

తమిళంలో పెట్టుకున్న టైటిల్ ను జస్ట్ తెలుగులో ఎలా పలుకుతామో.. పోస్టర్స్ లో అలానే వేసేస్తున్నారు. వేట్టయన్ విషయంలో కూడా అదే జరగడంతో విమర్శలు వచ్చాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి పెద్ద హీరో కూడా తెలుగు వెర్షన్ కు టైటిల్ మార్చకపోవడంతో చాలా మంది సోషల్ మీడియాలో మండిపడ్డారు. తెలుగు ఆడియన్స్ అంటే రెస్పెక్ట్ లేదా అని అడిగారు. ఇప్పుడు నటుడు జీవా కూడా అదే చేశారు! Aghathiyaa టైటిల్ తోనే తెలుగులోనూ మూవీ ప్రకటించారు.

దీంతో కోలీవుడ్ సినిమాల టాలీవుడ్ వెర్షన్ల టైటిల్స్ పై ఇప్పుడు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తెలుగు ప‌ట్ల‌ అన్యాయంగా ప్రవరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. భాషాభిమానం ఉండాలి కానీ.. మరీ ఇంతలా కాదని అంటున్నారు. కార్తీని చూసి నేర్చుకోండని సూచిస్తున్నారు. తెలుగులో టైటిల్స్ పెట్టకపోయినప్పుడు.. ఇక్కడి ఆడియన్స్ ఎందుకు ఆదరించాలని అడుగుతున్నారు. కొన్ని టైటిల్స్ అయితే వెక్కిరించినట్టు ఉంటున్నాయిని అంటున్నారు. అప్పుడు బాగానే పెట్టేవారని, ఇప్పుడు ఎందుకంత మార్పు వచ్చిందని క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో కోలీవుడ్ మేకర్స్ ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.