Begin typing your search above and press return to search.

రండి.. రండి దయ‌ చేయండంటూ పిలుస్తున్నాం ఇలా!

తెలుగు ప‌రిశ్ర‌మ న‌టులు భాష‌తో సంబంధం లేకుండా అన్ని భాష‌ల ద‌ర్శ‌కుల‌తోనూ ప‌ని చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తారు.

By:  Tupaki Desk   |   24 Feb 2025 5:12 AM GMT
రండి.. రండి దయ‌ చేయండంటూ పిలుస్తున్నాం ఇలా!
X

తెలుగు ప‌రిశ్ర‌మ న‌టులు భాష‌తో సంబంధం లేకుండా అన్ని భాష‌ల ద‌ర్శ‌కుల‌తోనూ ప‌ని చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తారు. అందులోనూ త‌మిళ ద‌ర్శ‌కులు అంటే మ‌రింత ఆస‌క్తితో ప‌ని చేస్తుంటారు. సొంతింటి రుచి కంటే పొరుగింట పుల్లకూర‌కే రుచి కాస్త‌ ఎక్కువ అని బ‌లంగానే న‌మ్ముతుంటారు. త్వ‌ర‌లోనే కొన్ని కాంబినేష‌న్స్ వెండి తెర‌కు ఎక్క‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాయి.

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ యువ సంచ‌ల‌నం లోకేష్ క‌న‌గ‌రాజ్ తో సినిమా చేయ‌డానికి ఆస‌క్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. 2027లో ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కు తుందంటున్నారు. అలాగే కింగ్ నాగార్జున కోలీవుడ్ కి చెందిన న‌వీన్ అనే కొత్త కుర్రాడితో ప‌నిచేయ‌డానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు.

ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుంద‌ని స‌మాచారం. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అట్లీతో సినిమాకు కొంత కాలంగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడు. ఇప్పుడా చర్చ‌లు దాదాపు కొలిక్కి వ‌చ్చిన‌ట్లే క‌నిపిస్తుంది. స‌న్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకొస్తుంద‌ని స‌మాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం బ‌న్నీ గురూజీని ప‌క్క‌న‌బెడుతున్నాడు అనే ప్ర‌చారం జ‌రుగుతోంది.

అలాగే `జైల‌ర్` ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ తో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. నెల్స‌న్ `జైల‌ర్ 2` త‌ర్వాత‌... తార‌క్ , ప్ర‌శాంత్ నీల్ ప్రాజెక్ట్ త‌ర్వాత ఇద్ద‌రు చేతులు క‌లిపే అవ‌కాశం ఉందంటున్నారు. అలాగే నేచుర‌ల్ స్టార్ నాని కూడా డాన్ డైరెక్ట‌ర్ శిబీ చ‌క్ర వ‌ర్తితో ఓ సినిమాకి ఒప్పందం చేసుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌డానికి ముందుకొస్తుంది. ఇంకా మ‌రికొంత మంది హీరోలు కూడా కోలీవుడ్ మేక‌ర్స్ కి ట‌చ్ లో ఉన్న‌ట్లు స‌మాచారం.