Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ పోలీసులు రాబోతున్నారు..!

ప్రస్తుతం ప్రభాస్‌తో పాటు పలువురు స్టార్‌ హీరోలు సైతం పోలీస్ స్టోరీ సినిమాలను చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   13 Feb 2025 2:23 PM GMT
టాలీవుడ్‌ పోలీసులు రాబోతున్నారు..!
X

టాలీవుడ్‌లో పోలీస్ కథా చిత్రాలు కొత్తేం కాదు. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అంతా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోలు పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రల్లో నటించిన విషయం తెల్సిందే. పోలీస్‌ స్టోరీలు ఎన్ని వచ్చినా కొత్తగా చూపించి, హీరోయిజంను ఎలివేట్‌ చేస్తే కచ్చితంగా మంచి విజయాలను సొంతం చేసుకుంటాయి. కనుక దర్శకులు కమర్షియల్‌ సినిమా అంటే పోలీస్ స్టోరీలను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌తో పాటు పలువురు స్టార్‌ హీరోలు సైతం పోలీస్ స్టోరీ సినిమాలను చేస్తున్నారు.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా 'స్పిరిట్‌' సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే. ఇటీవలే సినిమాకు సంబంధించిన కాస్టింగ్‌ కాల్‌ ప్రకటన వచ్చింది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ మొదటి సారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే వచ్చిన ప్రీ లుక్‌తో ఆ విషయాన్ని దర్శకుడు సందీప్‌ వంగా కన్ఫర్మ్‌ చేశాడు. ప్రభాస్ పర్సనాలిటీకి కచ్చితంగా స్పిరిట్‌ సినిమాలోని పోలీస్‌ పాత్ర మంచి హిట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అన్నింటిలోకి స్పిరిట్‌ పై అంచనాలు అధికంగా ఉన్నాయి. అందుకు ఒక కారణం ప్రభాస్ మొదటి సారి పోలీస్ ఆఫీసర్‌గా నటించడం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

హిట్‌ 3 లో నాని పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్న విషయం తెల్సిందే. హిట్‌ 1, హిట్‌ 2 సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో హిట్‌ 3 పై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా హిట్‌ 3లో నాని నటించడం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి. నానిని ఫుల్‌ లెంగ్త్‌ పోలీస్ ఆఫీసర్‌గా హిట్ 3 లో చూడబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'కింగ్డమ్‌' సినిమాలో విజయ్‌ దేవరకొండ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో కనిపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా విడుదలైన టీజర్‌లో విజయ్ దేవరకొండను చూస్తే పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడనే నమ్మకం కలుగుతుంది.

రవితేజ మాస్ జాతర సినిమాలో రైల్వే పోలీస్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ లుక్ ఇటీవల రివీల్ అయ్యింది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇంకా పలువురు యంగ్‌ హీరోలు సైతం పోలీస్ ఆఫీసర్‌లుగా రాబోతున్నారు. ఇటీవల విడుదలైన గేమ్‌ ఛేంజర్‌లో రామ్‌ చరణ్‌ కొంత సమయం ఐపీఎస్‌ ఆఫీసర్‌గా కనిపించాడు అనే విషయం తెల్సిందే. పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. మొత్తానికి టాలీవుడ్‌ నుంచి ఈ ఏడాది చాలా మంది పోలీసులు రాబోతున్నారు. అందులో ఎవరు హిట్‌ కొట్టేను చూడాలి.