మన దగ్గర కూడా లియో డామినేషన్
ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కూడా స్ట్రైట్ మూవీస్ కంటే లియో సినిమా పట్ల ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని
By: Tupaki Desk | 17 Oct 2023 6:30 AM GMTఈ వారం థియేటర్స్ లోకి మూడు పెద్ద సినిమాలు వస్తున్నాయి. వాటిలో ఇళయదళపతి విజయ్ లియో, బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు ఉన్నాయి. ఈ మూడు చిత్రాలకి తెలుగునాట క్రేజ్ ఉంది. లియో మూవీ డబ్బింగ్ సినిమా అయిన కూడా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తోన్న మూవీ కావడంతో ఎక్కువ హైప్ ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే లియో మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తో వంద కోట్లు వసూలు చేసింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కూడా స్ట్రైట్ మూవీస్ కంటే లియో సినిమా పట్ల ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని థియేటర్స్ లో జరుగుతోన్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే తెలుస్తోంది.
ఒక్క హైదరాబాద్ సిటీ పరిధిలోని థియేటర్స్ లో 243 షోలకి గాను 150 షోలు హౌస్ ఫుల్ అయిపోయాయి. భగవంత్ కేసరి 240 షోలకి గాను 50 మాత్రమే హౌస్ ఫుల్ అయ్యాయి. ఇక టైగర్ నాగేశ్వరరావుమూవీ 140 షోలకి గాను 33 షోలు మాత్రమే వేగంగా అడ్వాన్స్ బుకింగ్స్ తో హౌస్ ఫుల్ అయ్యాయి.
ఈ నెంబర్ చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాలలో భగవంత్ కేసరి కంటే లియో చిత్రంపై ఆడియన్స్ ఎక్కువ ఆసక్తితో ఉన్నట్లు అనిపిస్తోంది. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా చూసుకుంటే ప్రస్తుతానికి లియో మూవీ లీడింగ్ లో ఉంది. అయితే స్ట్రైట్ తెలుగు సినిమాలైన భగవంత్ కేసరిపైన బజ్ బాగానే ఉంది.
మౌత్ టాక్ బట్టి ఈ సినిమాల థియేటర్స్ సంఖ్య పెరగడం లేదా తగ్గడం అనేది డిసైడ్ అవుతుంది. లియో సినిమాపై ఉన్న హైప్ కారణం అని చెప్పొచ్చు. సెకండ్ డే నుంచి మాత్ టాక్ ఆధారంగానే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు. మరి ఈ వీకెండ్ లో మూడు చిత్రాలలో ఏది ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనేది వేచి చూడాలి.