Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : కుడి ఎడమ అయితే ఏంటో...?

తెలుగు బిగ్ బాస్ కొత్త సీజన్

By:  Tupaki Desk   |   19 July 2023 4:08 AM GMT
బిగ్ బాస్ 7 : కుడి ఎడమ అయితే ఏంటో...?
X

తెలుగు బిగ్ బాస్ కొత్త సీజన్ కు సంబంధించిన హడావుడి మొదలు అయింది. ఈసారి జులై లోనే మొదటి ప్రోమో వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేయడం జరిగింది. సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో కొత్త సీజన్‌ ప్రారంభం అవ్వాల్సి ఉంది. కానీ మెగా క్రికెట్‌ వేడుక ఉండటం వల్ల బిగ్ బాస్ ను ముందుగానే ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ సీజన్‌ 7 కి కూడా నాగార్జున హోస్ట్‌ అంటూ ఇటీవలే కన్ఫర్మ్‌ అయింది. అనుకున్నట్లుగానే బిగ్ బాస్ సీజన్ 7 కి హోస్ట్‌ నాగార్జున హోస్ట్‌ అని తేలిపోయింది. మొదటి ప్రోమోతోనే షో పై అంచనాలు పెంచారు. ముఖ్యంగా నాగార్జున ప్రత్యేకంగా ఉంటుంది అని చెప్పకుండా కుడి ఎడమ అయితే... అంటూ సస్పెన్స్ క్రియేట్ చేశారు.

బిగ్ బాస్ షో లో కుడి ఎడమ అవ్వడం ఏంటో అంటూ అంతా కూడా ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా అనుకున్నది జరగకుండా... పూర్తి విరుద్ధంగా విభిన్నంగా జరిగితే దాన్ని కుడి ఎడమ అయితే అన్నట్లుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. బిగ్ బాస్ ఈ సీజన్ లో కూడా మొత్తం ప్రేక్షకులు కానీ.. కంటెస్టెంట్స్ అనుకున్నది కాకుండా పూర్తి విరుద్ధంగా జరగబోతున్నట్లుగా అనిపిస్తుంది.

గత సీజన్ లకు పూర్తి విరుద్దంగా ఉంటుందనే హామీతోనే నాగార్జున హోస్ట్‌ గా చేసేందుకు ఒప్పుకున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి బిగ్‌ బాస్ సీజన్ 7 చాలా ప్రత్యేకంగా ఉంటుందని మొదటి ప్రోమో తోనే నమ్మకం కలిగించారు. గత సీజన్ లు వంద రోజులకు మించి ఉన్నాయి. కానీ ఈ సీజన్ మొదటి సీజన్ మాదిరిగా పది వారాలు మాత్రమే కొనసాగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.

కంటెస్టెంట్స్ విషయంలో.. టాస్క్‌ ల విషయంలో ఇలా ప్రతి విషయంలో కూడా కుడి ఎడమ అయితే అన్నట్లుగా ఈ సారి షో ఉంటుందని స్టార్‌ మా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. బుల్లి తెర మొదలుకుని సోషల్‌ మీడియా సెలబ్రెటీల వరకు పలువురు.. పలు రంగాలకు చెందిన వారు ఈ షో లో ఉండే అవకాశాలు ఉన్నాయి.