Begin typing your search above and press return to search.

ఈసారైనా బిగ్ బాస్ లోకి ఆ యాంకర్ వెళ్తుందా..!

ఈ సీజన్ లో ఎవరెవరు ఉంటున్నారు అనే లిస్ట్ దాదాపు అన్ని మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంది

By:  Tupaki Desk   |   11 Aug 2023 8:18 AM GMT
ఈసారైనా బిగ్ బాస్ లోకి ఆ యాంకర్ వెళ్తుందా..!
X

బిగ్ బాస్ సీజన్ 7 మొదలవబోతుంది. ఈ సీజన్ లో ఎవరెవరు ఉంటున్నారు అనే లిస్ట్ దాదాపు అన్ని మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంది. అయితే గత 3 సీజన్లుగా ఒక తెలుగు యాంకర్ పేరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో జత చేర్చుతున్నా తీరా షో మొదలై హౌస్ మెట్స్ పరిచయం చేసే సరికి అమ్మడు మిస్ అవుతుంది. ఇది ఇప్పుడు కాదు దాదాపు బిగ్ బాస్ సీజన్ 3 నుంచి కూడా ఇదే జరుగుతుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఆమె పేరు ప్రస్తావించడం ఆమె ఈసారి కంపల్సరీ అని హడావిడి చేయడం తీరా షో టైం కి ఆమె లేకుండా బిగ్ బాస్ నడవడం తెలిసిందే.

ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టంట్స్ లిస్ట్ లో కూడా ఆమె పేరు ప్రస్తావిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 లో 18 నుంచ్ 20 మంది హౌస్ మెట్స్ కంటెస్టంట్స్ గా ఉంటారని తెలుస్తుండగా అందులో యాంకర్ కమ్ యాక్ట్రెస్ వర్షిణి కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే యాంకర్ వర్షిణి ఇప్పుడు కాదు బిగ్ బాస్ సీజన్ 3 నుంచి ఆమె హౌస్ లోకి వెళ్తుందని హడావిడి చేయడం మొదలు పెట్టారు. షో మొదలయ్యే దాకా వర్షిణి ఈసారి పక్కా బిగ్ బాస్ లోకి వెళ్తుందని చెప్పడం ఆ తర్వాత ఆమె మిస్ అవ్వడం జరుగుతున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 7 లో అయినా వర్షిణి వస్తుందా ఢీ టీం లీడ్ గా చేసి అలరించిన వర్షిణి ఆ తర్వాత స్టార్ మా లో అదిరింది షో యాంకరింగ్ చేసింది. ఆ తర్వాత అమ్మడు కనిపించలేదు. ఇలా బిగ్ బాస్ సీజన్ మొదలయ్యే టైం లో ప్రతిసారి ఆమె గురించి వార్తలు రావడం ఆ తర్వాత సైలెంట్ అవడం తెలిసిందే. ఈమధ్య పెద్దగా బుల్లితెర మీద కూడా కనిపించని వర్షిణి కెరీర్ ని ఎందుకు అలా లైట్ తీసుకుందో తెలియాల్సి ఉంది.

బిగ్ బాస్ లో వస్తుందంటూ 3 సీజన్లు గా తనపై మీడియా కవరేజ్ ఆమె గ్రాఫ్ ని పెంచే ప్రయత్నం చేసినా బయట పెద్దగా షోస్ ఏమి చేయలేకపోవడంతో అమ్మడు గురించి ఆలోచించడం మానేశారు ఆడియన్స్. అప్పుడప్పుడు ఏదో అలా ఫోటో షూట్స్ చేస్తూ కాలం వెళ్లదీస్తుంది వర్షిణి మరి అసలు వర్షిణి బిగ్ బాస్ కు వెళ్తుందా లేదా ఆమెని బిగ్ బాస్ కి వెళ్లకుండా అడ్డు పడుతుంది ఏంటి ఈ విషయాలన్నీ తెలియాల్సి ఉంది.