బిగ్ బాస్ 8 మొదలు ఎప్పుడంటే..!
బిగ్ బాస్ సీజన్ 8 ను సెప్టెంబర్ 1 నుంచి అంటే ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభించబోతున్నారు.
By: Tupaki Desk | 21 Aug 2024 10:09 AM GMTతెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించిన ప్రారంభ తేదీ ని స్టార్ మా వారు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకు ఏడు రెగ్యులర్ సీజన్ లతో పాటు ఒక ఓటీటీ సీజన్ ను పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాడు. బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం కు ముహూర్తం కన్ఫర్మ్ అయ్యింది. షో నిర్వాహకులు అందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసి టెలికాస్ట్ తేదీని అధికారికంగా ప్రకటించడం జరిగింది.
బిగ్ బాస్ సీజన్ 8 ను సెప్టెంబర్ 1 నుంచి అంటే ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభించబోతున్నారు. మొదటి రోజు మూడు గంటల పాటు షో సాగనుంది. సాయంత్రం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు షో ను కంటిన్యూ చేస్తారు. ఆ మూడు గంటల పాటు కంటెస్టెంట్స్ పరిచయం, మధ్యలో వారి డాన్స్ లు ఉంటాయి. నాగార్జున తో ఆదివారం మధ్యాహ్నం నుంచి షూటింగ్ ప్రారంభిస్తారు. మరీ ఎక్కువ సమయం కాకుండా కొన్ని గంటల ముందు నుంచే షూటింగ్ ను ప్రారంభిస్తారు.
ఆగస్టు 31 నుంచి బిగ్ బాస్ షూటింగ్ మొదలు అవ్వనుంది. ముందు రోజే కొంత మంది కంటెస్టెంట్స్ యొక్క డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో పాటు స్కిట్ లను కూడా రూపొందిస్తారు. అలా బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ సోమవారం నుంచి ప్రేక్షకులకు వినోదాన్ని అందించబోతున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 బిగ్గెస్ట్ సూపర్ హిట్ సీజన్ గా నిలవడం వల్ల ఈసారి కూడా అంతకు మించి ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.
తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కి కూడా నాగార్జున హోస్టింగ్ చేయబోతున్నాడు. ఇప్పటికే ఆ విషయం కన్ఫర్మ్ అయ్యింది. కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయంలో స్టార్ మా వారు ఊహకు సైతం అందకుండా, లీక్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు. గతంలో కొందరి పేర్లను ముందుగానే మనం చెప్పాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంతా సీరియస్ మ్యాటర్ గానే కొనసాగుతుంది. బిగ్ బాస్ అంటేనే లీక్స్ కామన్‌విషయం... అయినా కూడా ఎందుకు ఈసారి కంటెస్టెంట్స్ జాబితా లీక్ అవ్వడం లేదు అనే చర్చ జరుగుతోంది.