బిగ్గెస్ట్ తెలుగు షో సూపర్ అప్‌డేట్
ఓటీటీ సీజన్ తో కలిపి ఇప్పటి వరకు నాగార్జున ఆరు సీజన్ లకు హోస్ట్ గా వ్యవహరించాడు.
By: Tupaki Desk | 3 Aug 2024 1:28 PM GMTప్రపంచ వ్యాప్తంగా బిగ్‌బాస్ షో కి మంచి ఆధరణ ఉంది. ముఖ్యంగా ఇండియాలో హిందీ ప్రేక్షకులు బిగ్ బాస్ ను సుదీర్ఘ కాలంగా ఆధరిస్తున్నారు. ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ 7 సీజన్ లు పూర్తి చేసుకుంది. ఒక ఓటీటీ సీజన్ తో కలిపి ఎనిమిది సీజన్ లు జరిగింది.
ఓటీటీ సీజన్ తో కలిపి ఇప్పటి వరకు నాగార్జున ఆరు సీజన్ లకు హోస్ట్ గా వ్యవహరించాడు. ఈ ఏడాది జరుగబోతున్న బిగ్ బాస్ సీజన్ 8 కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఒప్పందాలు పూర్తి అయ్యాయి. కంటెస్టెంట్స్ ఎంపిక కూడా దాదాపు పూర్తి అయ్యింది.
గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కఠినంగా జరిగిందని సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 8 కోసం ఏకంగా 200 మంది పేర్లను తీసుకుని, అందులోంచి 25 మందితో తుది జాబితా సిద్ధం చేయడం జరిగింది.
ఆ 25 మందిలోంచి 18 లేదా 20 మందిని హౌస్ లోకి మొదటి రోజు పంపే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కూడా మరికొంత మందిని హౌస్ లోకి పంపిస్తారని తెలుస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అవ్వబోతుందని స్టార్ మా వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈసారి సోషల్ మీడియా సెలబ్రెటీలతో పాటు, వేణు స్వామి వంటి విభిన్నమైన కంటెస్టెంట్స్ ను ఇంకా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని, బుల్లి తెరకు చెందిన వారిని కూడా తీసుకున్నారట. ప్రస్తుతం కంటెస్టెంట్స్ తో ఒప్పందాలు జరుగుతున్నాయి. గత సీజన్ లతో పోల్చితే ఈ సీజన్ చాలా కొత్తగా ఉంటుందని బిగ్ బాస్ రివ్యూవర్స్ చెబుతున్నారు.