డబ్బింగ్ లో వాటిని లైట్ తీసుకుంటున్నారు!
ఈ మధ్య కాలంలో డబ్బింగ్ సినిమాల్లో పాటలను చూస్తే ఉంటే బాబోయ్ అంటూ తల పట్టుకునే పరిస్థితి ఉంది.
By: Tupaki Desk | 14 Oct 2023 1:30 PM GMTతెలుగు బాక్సాఫీస్ వద్దకు నెలలో కనీసం రెండు మూడు డబ్బింగ్ సినిమాలు అయినా వస్తున్నాయి. వాటిల్లో కొన్ని సినిమాలను ప్రేక్షకులు కనీసం గుర్తించకుండానే వెళ్లి పోతూ ఉంటే కొన్ని సినిమాలు మాత్రం యావరేజ్ గా నిలుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో డబ్బింగ్ అయ్యి భారీ విజయాలను సొంతం చేసుకున్న సినిమాలే లేవు. బిచ్చగాడు 2.. కాంతార.. కేజీఎఫ్ తర్వాత ఆ స్థాయి విజయాలను సొంతం చేసుకోలేదు.
ఈ మధ్య కాలంలో డబ్బింగ్ సినిమాల్లో పాటలను చూస్తే ఉంటే బాబోయ్ అంటూ తల పట్టుకునే పరిస్థితి ఉంది. ఇదెక్కడి పాట మావ అంటూ చాలా మంది డబ్బింగ్ సినిమాల యొక్క పాటలకు విమర్శలు చేస్తున్నారు. ఆ పాటల్లో లిరిక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్లుగా ఉంటున్నాయి.
కొన్నేళ్ల క్రితం వరకు వచ్చిన డబ్బింగ్ సినిమాల్లో తమిళ్ బోర్డులను మరియు ఇతర భాషల సైన్ బోర్డ్ లను మార్ఫింగ్ చేసి తెలుగు లో చూపించే వారు. కానీ ఇప్పుడు కొన్ని సినిమా ల్లో కనీసం ఆ బోర్డులను కూడా మార్చడం లేదు. డబ్బింగ్ చేశాం అంటే చేశాం అన్నట్లుగా తూతూ మంత్రంగా పని కానిచ్చేస్తున్నారు అంటూ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల డబ్బింగ్ సినిమాలను చూసుకున్నా కూడా కనీసం లిరిక్స్ ను ఒక మంచి రచయితతో రాయించడం లేదు.. అలాగే డబ్బింగ్ లో క్వాలిటీ ఉండటం లేదు. అదుకే డబ్బింగ్ సినిమాలు చూడాలి అంటేనే ఆసక్తి కలగడం లేదు అంటూ సగటు సినీ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ముందు ముందు అయినా డబ్బింగ్ సినిమాల్లో పాటలు, ఇతర విషయాల పట్ల జాగ్రత్త తీసుకుంటారేమో చూడాలి.