Begin typing your search above and press return to search.

తంగలాన్ ఇలా అయితే కష్టమే..?

సినిమాకు ముందే ఏదో ఒక ఈవెంట్, రెండు రోజులు ఇంటర్వ్యూస్ ఇస్తే సరిపోతుందని అనుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   26 July 2024 4:39 AM GMT
తంగలాన్ ఇలా అయితే కష్టమే..?
X

ఒకప్పుడు తమిళ స్టార్ హీరో విక్రం సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది అంటే ఆ సినిమాపై అంచనాలు.. ప్రాజెక్ట్ పై బిజినెస్ భారీగా ఉండేది. కానీ విక్రం ఈమధ్య పూర్తిగా ఫాం కోల్పోయే సరికి బిజినెస్ విషయం అటుంచితే అసలు సినిమాపై బజ్ ఏమాత్రం రావట్లేదు. విక్రం మాత్రం తన ప్రతి సినిమాను తెలుగు ఆడియన్స్ కు అందించాలని అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ప్రమోషన్స్ విషయంలో దృష్టి పెట్టట్లేదు. సినిమాకు ముందే ఏదో ఒక ఈవెంట్, రెండు రోజులు ఇంటర్వ్యూస్ ఇస్తే సరిపోతుందని అనుకుంటున్నాడు.

విక్రం సినిమాలు కోలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా ఈమధ్య నిరాశ పరిచాయి. కొన్ని సినిమాలు అక్కడ ఇక్కడ ఫలితాలు వేరుగా ఉంటాయి. కానీ తెలుగు, తమిళ్ లో పూర్తిగా వెనకబడ్డాడు విక్రం. ఐతే మళ్లీ తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు ఈసారి తంగలాన్ సినిమాతో వస్తున్నాడు. పా రంజిత్ డైరెక్షన్ లో డిఫరెంట్ కథాంశంతో ఈ మూవీ వస్తుంది. ట్రైలర్ చూస్తే విక్రం తన బెస్ట్ ఇచ్చేశాడని అనిపిస్తుంది.

ప్రతి సినిమాలో తను రకరకాల వేషధారణతో ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్న విక్రం ప్రయత్నాలన్నీ వర్క్ అవుట్ అవ్వట్లేదు. అసలు సరైన కథ లేకుండా ఎలాంటి ప్రయోగాలు చేసినా సరే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరు. ఐతే ఈసారి పా రంజిత్ తో ఒక పర్ఫెక్ట్ స్టోరీ టెల్లింగ్ తోనే తంగలాన్ ని తెస్తున్నారని అంటున్నారు. ఐతే ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ ఫిక్స్ చేయగా ఇప్పటివరకు తెలుగులో ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ మొదలు పెట్టలేదు.

ఆల్రెడీ ఆరోజే రామ్ డబుల్ ఇస్మార్ట్ తో పాటుగా రవితేజ మిస్టర్ బచ్చన్ వచ్చేస్తున్నాయి. రెండు మాస్ సినిమాలే అవ్వడంతో వీటికి పోటీగా వచ్చే తంగలాన్ ని ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తే తప్ప ఆడియన్స్ దృష్టిలోకి వెళ్లే ఛాన్స్ లేదు. మరి తంగలాన్ మేకర్స్ ఆలోచన ఎలా ఉందో కానీ విక్రం తెలుగు ఫ్యాన్స్ మాత్రం సినిమా ప్రమోషన్స్ చేయలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. తంగలాన్ తో భారీ టార్గెట్ పెట్టుకున్న విక్రం అందుకు తగిన కంటెంట్ తోనే వస్తున్నాడా లేదా అన్నది రిలీజ్ రోజు తెలుస్తుంది. విక్రం తంగలాన్ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించగా పార్వతి తిరువొతు ఇంపార్టెంట్ రోల్ లో నటించింది.