Begin typing your search above and press return to search.

వాయిదా ఓ అలవాటుగా మారిందా!

ఒక‌ప్పుడు సినిమా వాయిదా ప‌డిందంటే ద‌ర్శ‌క‌-నిర్మాత‌ల‌--హీరోల్లో బోలెడంత హైరానా క‌నిపించేది. మ‌రోవైపు లీకుల బెడ‌ద‌..పైర‌సీ తంతు కూడా ఉంది కాబ‌ట్టి బాగా టెన్ష‌న్ ప‌డేవారు.

By:  Tupaki Desk   |   28 Oct 2023 2:30 PM GMT
వాయిదా ఓ అలవాటుగా మారిందా!
X

ఒక‌ప్పుడు సినిమా వాయిదా ప‌డిందంటే ద‌ర్శ‌క‌-నిర్మాత‌ల‌--హీరోల్లో బోలెడంత హైరానా క‌నిపించేది. మ‌రోవైపు లీకుల బెడ‌ద‌..పైర‌సీ తంతు కూడా ఉంది కాబ‌ట్టి బాగా టెన్ష‌న్ ప‌డేవారు. సినిమా పూర్త‌యితే వీలైనంత త్వ‌రగా రిలీజ్ చేయాల‌ని కంగారు ప‌డేవారు. సినిమా హిట్ అవుతుందా? ఫ‌ట్ అవుతుందా? అన్న‌ది త‌ర్వాత సంగ‌తి స‌రైన తేదీ చూసుకుని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చామా? లేదా? అనే ఓ కంగారు క‌నిపించేది.

కానీ ఇప్పుడా స‌న్నివేశం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. కూలాశగా అన్ని అనుకున్న ట్లు..స‌క్ర‌మంగా ఉంటే రిలీజ్ చేస్తున్నారు. లేదంటే వాయిదా వేసామంటూ ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసి ఉరుకుంటున్నారు. అప్పుడు కూడా మ‌ళ్లీ ఏతేదికి రిలీజ్ చేస్తామ‌న్న‌ది చెప్ప‌డం లేదు. అన్ని ర‌కాల అనుకూల‌త‌లు చూసుకుని రిలీజ్ తేదిని ప్ర‌క‌టిస్తున్నారు. `రాధేశ్యామ్`..`ఆదిపురుష్` స‌హా చాలా సినిమాల విష‌యంలో ఇలాగే జ‌రిగింది.

ఈ పాన్ ఇండియా చిత్రాల రిలీజ్ విష‌యంలో ఎంత హైడ్రామా న‌డిచిందో తెలిసిందే. గ‌డిచిన మూడేళ్ల‌లో రిలీజ్ విష‌యంలో మేక‌ర్స్ ఏమాత్రం తొంద‌ర‌ప‌డ‌టం లేదు. ప‌నులు పూర్తికాక‌పోయినా...థియేట‌ర్లు అనుకున్న వి దొర‌క్క‌పోయినా వెనక్కి వెళ్లిపోతున్నారు. తాజాగా `స‌లార్` కూడా వివిధ కార‌ణాల‌తో వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది మిడ్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా అప్ప‌టి నుంచి తేదీలు ప్ర‌క‌టిండ‌చం..వెన‌క్కి వెళ్ల‌డం సంగ‌తి తెలిసిందే.

అయితే వాయిదా అనేది రిలీజ్ పై కూడా పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. ఒక‌ప్పుడు బ‌జ్ త‌గ్గుతుం ద‌నో..పైర‌సీ అవుతుంద‌నే భ‌యం క‌నిపించేది. ఇప్పుడా భ‌యాలు క‌నిపించ‌లేదు. సినిమాలో విష‌యం ఉంటే హిట్ అవుతుంది.. లేక‌పోతే పోతుంది! అన్న విధానం చాలా మందిలో కామ‌న్ గా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం `గేమ్ ఛేంజ‌ర్` సెట్స్ లో ఉంది. ఈ సినిమా షూటింగ్ డిలే అవుతుంది. రిలీజ్ అనుకున్న స‌మ‌యానికి జ‌రుగుతుందా? లేదా? అన్న‌ది క్లారిటీ లేదు. స‌హ‌జంగా శంక‌ర్ సినిమాలు చెప్పిన తేదికి వ‌చ్చిన సంద‌ర్భాలు చాలా రేర్. దిల్ రాజు ఎంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌న్నా? అది సాధ్య‌ప‌డుతుందా? లేదా? అన్న‌ది శంక‌ర్ చేతుల్లో నే ఉంది.