టాలీవుడ్ హీరోలతో వాళ్ల గుండెల్లో రైళ్లే!
అతడు మాత్రమే తాను రాసుకు న్న పాత్రకు న్యాయం చేయగలడని భావించి డార్లింగ్ ని రంగంలోకి దించి ఆ సినిమా చేసాడు.
By: Tupaki Desk | 9 Feb 2024 11:30 AM GMTటాలీవుడ్ హీరోల ఎంట్రీతో బాలీవుడ్ హీరోల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా? తెలుగు హీరోల పాన్ ఇండియా ఇమేజ్ ముందు బాలీవుడ్ హీరోలు తేలిపోతున్నారా? అంటే అవుననే సంకేతాలు అందుతు న్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియాలో తెలుగు హీరోల క్రేజ్..రేంజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అందుకే బాలీవుడ్ మేకర్స్ అంతా టాలీవుడ్ హీరోల కోసం క్యూ కడుతున్నారు. బాలీవుడ్ లో అంత మంది స్టార్లు ఉన్నా ఓంరౌత్ `ఆదిపురుష్` కోసం ప్రభాస్ ని ఏరికోరి మరి తీసుకున్నారు.
అతడు మాత్రమే తాను రాసుకు న్న పాత్రకు న్యాయం చేయగలడని భావించి డార్లింగ్ ని రంగంలోకి దించి ఆ సినిమా చేసాడు. ఆ సినిమా ఫలితం సంగతి పక్కనబెడితే ప్రభాస్ ని తీసుకోవడం అప్పట్లో ఓ సంచల నం. ఇక బాహుబలి తర్వాత బాలీవుడ్ దిగ్గజ దర్శక-నిర్మాత డార్లింగ్ ని తమ ఇండస్రీకి తీసుకెళ్లిపోవాలని ఎలా ప్రయత్నించారో తెలిసిందే. అటుపై రామ్ చరణ్-ఎన్టీఆర్ పైనా కరణ్ కళ్లు పడ్డాయి. కానీ ఆ ముగ్గురు సున్నితంగా స్కిప్ కొట్టారు. హిందీలో అంత మంది హీరోలున్నా? కరణ్ వీళ్ల వెంటే ఎందుకు పడ్డారో? ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇప్పుడు ఏకంగా ఆయాన్ ముఖర్జీ `వార్ -2` కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తీసుకున్న వైనం తెలిసిందే. అక్కడ ఎంతో మంది ట్యాలెంటెడ్ నటులు ఉన్నా తారక్ మాత్రమే తన పాత్రకు న్యాయం చేస్తాడని భావించి వార్ -2 కోసం టైగర్ ని తీసుకున్నాడు. యంగ్ టైగర్ కోసం హృతిక్ రోషన్ ఎంతలా ఎదురు చూసాడో కూడా తెలిసిందే. తన ఇమేజ్ ని పాన్ ఇండియాలో అతడుమాత్రమే మ్యాచ్ చేస్తాడని హృతిక్ భావించి ముందుకొచ్చాడు.
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పైనా చాలా మంది బాలీవుడ్ దర్శకుల కళ్లు ఇప్పటికే పడ్డాయి. `పుష్ప` సినిమా తో బన్నీ ఉత్తమ జాతీయ అవార్డు సైతం అందుకోవడంతో బన్నీతో సినిమా చేయాలి? అన్న బాలీవుడ్ జాబితా అంతకంతకు పెరుగుతుంది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఏకంగా ఓ పీరియాడిక్ స్టోరీనే సిద్దం చేస్తున్నారన్న ప్రచారం వెడెక్కి స్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో మంది దిగ్గజాల్ని డైరెక్ట్ చేసిన గ్రేట్ మేకర్ ఇప్పుడు చరణ్ కోసం ప్రత్యే కంగా చరిత్రనే రాస్తున్నాడంటే? ఎంత ప్రత్యేకమన్నది చెప్పాల్సిన పనిలేదు.
మరి ఈ సన్నివేశాలన్నీ చూసి బాలీవుడ్ హీరోలు బయటకి చెప్పలేక లో-లోపల నలిగిపోతున్నారా? ముఖ్యంగా టైర్ -2..టైర్ -3 హీరోల మార్కెట్ కి మన హీరోలు గండికొడుతున్నారా? అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. నేరుగా బాలీవుడ్ మేకర్సే వాళ్లందర్నీ పక్కనబెట్టి..ఓ మెట్టు కిందకి దిగొచ్చి తెలుగు హీరోల తో సై అనడంతోనే ఈ రకమైన సన్నివేశం కనిపిస్తోంది.