Begin typing your search above and press return to search.

ఇండియన్‌ 2 తెలుగు పరిస్థితి ఏంటి...!

తమిళ నాట ప్రమోషన్ సందడి మొదలు అయ్యింది. కానీ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎలాంటి హడావుడి కనిపించడం లేదు.

By:  Tupaki Desk   |   7 Jun 2024 3:30 PM GMT
ఇండియన్‌ 2 తెలుగు పరిస్థితి ఏంటి...!
X

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ మరియు దర్శకుడు శంకర్ ల కాంబోలో రూపొందిన చిత్రం 'ఇండియన్‌ 2'. చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఇండియన్ 2 సినిమాను ఎట్టకేలకు విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు పూర్తి చేశారు. జులై 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు తమిళనాట మొదలు అయ్యాయి.

ఇండియన్ 2 విడుదలకు అటు ఇటుగా నెల సమయం మాత్రమే ఉంది. తమిళ నాట ప్రమోషన్ సందడి మొదలు అయ్యింది. కానీ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎలాంటి హడావుడి కనిపించడం లేదు. శంకర్‌ ప్రస్తుతం చరణ్‌ తో గేమ్‌ చేంజర్‌ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ కారణంతో కూడా ఇండియన్ 2 కి తెలుగు లో మంచి క్రేజ్ బిల్డ్‌ అవ్వాలి.

కానీ ఇప్పటి వరకు తమిళనాట తప్పితే తెలుగు రాష్ట్రాల్లో మినిమం బజ్‌ కనిపించడం లేదు. తెలుగు సోషల్‌ మీడియాలో అంతో ఇంతో సందడి ఉన్నా కూడా రియాల్టీ విషయానికి వస్తే మాత్రం పెద్దగా హైప్‌ లేదు అనే ప్రచారం జరుగుతుంది. అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అంతంత మాత్రమే అనే చర్చ జరుగుతుంది.

కమల్‌ హాసన్ తెలుగు సినిమా కల్కి లో కూడా నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఈ నెలలోనే విడుదల అవ్వబోతుంది. కల్కి వచ్చిన తర్వాత ఏమైనా ఇండియన్ 2 కి బజ్‌ క్రియేట్‌ అయ్యేనా అంటూ బయ్యర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.

శంకర్‌ సినిమా అంటే ఒకప్పుడు ఉన్నంత క్రేజ్ మరియు బజ్‌ తెలుగు రాష్ట్రాల్లో లేదు అనే చెప్పాలి. రోబో తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరుచుతూ వచ్చాయి. కనుక ఇండియన్‌ 2 విషయంలో మెజార్టీ ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి లేరు. వచ్చిన తర్వాత చూద్దాం, హిట్ అయితే చూద్దాం అన్నట్లుగా ఉన్నారు అనేది విశ్లేషకుల అభిప్రాయం.