శ్రీలంకలో టాలీవుడ్ దే హవా!
తమ దేశంలో రిలీజ్ అయ్యే ప్రతీ సినిమాను ఖాళీ ఉంటే తప్పకుండా చూస్తారుట. దీంతో తెలుగు సినిమాకి శ్రీలంకలో ఎలాంటి ఆదరణ లభిస్తుందో తెలుస్తుంది.
By: Tupaki Desk | 28 Sep 2023 3:30 PM GMTనేడు తెలుగు సినిమా పాన్ ఇండియాలో ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. పాన్ వరల్డ్ లోనూ అంతే సంచలనమవుతుంది. `బాహుబలి`..`ఆర్ ఆర్ ఆర్` లాంటి సినిమాలు తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తం చేసాయి. అమెరికా.. ఆస్ట్రేలియా..చైనా..జపాన్...థాయ్ లాండ్. .మలేషియా ..రష్యా...సింగపూర్ లాంటి దేశాల్లోనూ తెలుగు సినిమా సత్తా చాటుతుంది. నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలు రెట్టింపు అయ్యాయి.
ఒకప్పుడు ఈస్థాయిలో హిందీ సినిమాలు కనిపించేవి. ఇప్పుడా సినిమాని పక్కకు నెట్టి తెలుగు సినిమా తిష్ట వేసింది. తాజాగా శ్రీలంకలోనూ టాలీవుడ్ దే హవా అని తెలుస్తోంది. స్వయంగా ఆ దేశ పౌరుడు..మాజీ అంతర్జాతీయ క్రికెట్ లెజెండ్ ముత్తయ్య మురళీ ధరన్ ఈవిషయాన్ని స్వయంగా తెలిపారు. ఒకప్పుడు తమ దేశంలో ఎక్కువగా హిందీ..తమిళ సినిమాలు తమ భాషలో ఎక్కువగా అనువాదమయ్యేవి అన్నారు. ఇప్పుడు వాటితో పాటు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
హిందీ కంటే ఎక్కువగా తెలుగు సినిమాలే మార్కెట్ లో కనిపిస్తున్నాయన్నారు. ప్రత్యేకంగా ముత్తయ్య తెలుగు సినిమాలకు వీరాభిమాని అట. తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తారుట. అందులో నాని సినిమాలు అస్సలు మిస్ అవ్వరుట. తమ దేశంలో రిలీజ్ అయ్యే ప్రతీ సినిమాను ఖాళీ ఉంటే తప్పకుండా చూస్తారుట. దీంతో తెలుగు సినిమాకి శ్రీలంకలో ఎలాంటి ఆదరణ లభిస్తుందో తెలుస్తుంది.
అయితే తెలుగు సినిమాలు ఎక్కువగా అమెరికాలో రిలీజ్ అవుతుంటాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఆమెరికా మార్కెట్లో తెలుగు సినిమాలు విరివిగా రిలీజ్ అవుతాయి. తెలుగు వాళ్లు సహా భారతీయులు అమెరికాలో ఎక్కువగా స్థిరపడటంతో అమెరికా మార్కెట్ ని కీలకంగా భావించి నిర్మాతలు అక్కడ తప్పకుండా రిలీజ్ చేస్తారు. అక్కడ నుంచి పెద్ద డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంది. శ్రీలంకలో కూడా తెలుగు సినిమా ఆస్థాయిలో వృద్దిలోకి రావాలని నెటి జనులు ఆశిస్తున్నారు. చిన్న దేశమైనా! ఆదరణ దక్కుతున్నప్పుడు అక్కడ రిలీజ్ లపై నా నిర్మాతలు దృష్టి పెట్టాలని కోరుతున్నారు.