Begin typing your search above and press return to search.

టాలీవుడ్ మూవీస్.. కన్నడలో ఏమి డిమాండు బాబోయ్

ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల పై కోట్లాది రూపాయిలు రిలీజ్ రైట్స్ కోసం పెట్టుబడి పెడతారు.

By:  Tupaki Desk   |   1 Aug 2023 4:18 AM GMT
టాలీవుడ్ మూవీస్.. కన్నడలో ఏమి డిమాండు బాబోయ్
X

సౌత్ లో తెలుగు సినిమాల కి ఏపీ, తెలంగాణ కాకుండా అతి పెద్ద మార్కెట్ ఉన్నది కర్ణాటక లో అని చెప్పాలి. ఆ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు తెలుగు మాట్లాడగలగేవారు ఉంటారు. ముఖ్యంగా బెంగుళూరు లో అయితే తెలుగు ప్రజలే ఎక్కువని చెప్పాలి. అందుకే కర్ణాటక రాష్ట్రం లో మన సినిమాల కి మంచి డిమాండ్ ఉంటుంది. మాతృభాష చిత్రాల కి వచ్చే కలెక్షన్స్ కంటే తెలుగు మూవీస్ కి ఎక్కువ వస్తూ ఉంటాయి.

అందుకే అక్కడ డిస్టిబ్యూటర్స్ తెలుగు సినిమాల కి సంబంధించి కర్ణాటక హక్కుల కోసం ఎక్కువ మొత్తం లోనే ఖర్చు చేస్తారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల పై కోట్లాది రూపాయిలు రిలీజ్ రైట్స్ కోసం పెట్టుబడి పెడతారు. నెక్స్ట్ రాబోతున్న సినిమాల లో ఏ మూవీకి ఎంత కర్ణాటక రిలీజ్ హక్కుల కోసం కోట్ చేశారో చూసుకుంటే హైయెస్ట్ గా 60 కోట్లతో కల్కి 2898 ఏడీ మూవీ ఉంది. ఇప్పటికే ఈ మూవీ హక్కులు అమ్ముడైపోయినట్లు తెలుస్తోంది.

దీని తర్వాత స్థానం లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ చిత్రం ఉంది. ఈ సినిమా రైట్స్ కూడా 60 కోట్ల వరకు కోట్ చేయబడినట్లు తెలుస్తోంది. హోంబలే ఫిలిమ్స్ సొంతంగానే ఈ మూవీని కర్ణాటక లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. కల్కి, సలార్ రెండు కూడా ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. వీటి తర్వాత రామ్ చరణ్, శంకర్ కాంబో లో సిద్ధమవుతోన్న గేమ్ చేంజర్ సినిమాకి 25 కోట్లు ఆఫర్ ఉంది.

అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 రైట్స్ కూడా 25 కోట్లకి అమ్ముడైపోయినట్లు తెలుస్తోంది. పుష్ప సినిమా కన్నడ నాట సూపర్ హిట్ అయిన నేపథ్యంలో పుష్ప 2కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. తరువాత పవర్ స్టార్ ఓజీ సినిమా కి 20 కోట్ల వరకు రైట్స్ కోసం ఆఫర్ ఉంది. కర్ణాటక లో పవర్ స్టార్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఈ స్థాయిలో డిమాండ్ వచ్చింది. విజయ్ దేవరకొండ, సమంత ఖుషి సినిమా హక్కులు 8 కోట్లకి సోల్డ్ అయిపోయాయి. నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న సినిమా రిలీజ్ రైట్స్ 5 కోట్ల వరకు ఆఫర్ ఉందంట.

రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబో లో తెరకెక్కనున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాకి 5 కోట్ల వరకు డిస్టిబ్యూటర్స్ నుంచి ఆఫర్ వస్తుందంట. దాంతో పాటు రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న స్కంద సినిమాకి కూడా 4.50 కోట్లు రిలీజ్ రైట్స్ కోసం కోట్ చేసారంట. ఇలా టాలీవుడ్ లో సిద్ధమవుతోన్న పాన్ ఇండియా సినిమాలు అన్నింటికీ కూడా సాలిడ్ మార్కెట్ కర్ణాటక లో సిద్ధమవుతోందని వీటి హక్కుల కోసం యున్న డిమాండ్ బట్టి తెలుస్తోంది. కర్ణాటక లో ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన హీరోల జాబితా చూసుకుంటే మొదటి స్థానం లో జూనియర్ ఎన్ఠీఆర్ ఉన్నాడు, రెండో స్థానంలో రామ్ చరణ్, మూడో స్థానంలో అల్లు అర్జున్, నాలుగు, ఐదో స్థానాల్లో .