ఫిలింఫేర్ 2024: కీర్తి ఉత్తమ నటి నాని ఉత్తమ నటుడు
తన దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హాయ్ నాన్న దర్శకుడు శౌర్యువ్ విజయాలను పురస్కరించుకుని అవార్డు కార్డులను రూపొందించనున్నట్లు నాని ఈ వేదికపై ప్రకటించారు.
By: Tupaki Desk | 4 Aug 2024 8:18 AM GMTఫిలింఫేర్ 2024 సౌత్ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్ లో తారల నడుమ వైభవంగా జరిగింది. నేచురల్ స్టార్ నాని నటించిన `దసరా` ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆరు విభిన్న విభాగాలలో అవార్డులను కైవసం చేసుకుంది. నాని అద్భుతమైన నటనకు గాను `ఉత్తమ నటుడు` అవార్డు లభించింది. `దసరా`లో నాని నటనకు విమర్శకుల ప్రశంసలు కురిసాయి. దానికి ఇప్పుడు అవార్డు రూపంలో ప్రతిఫలం దక్కింది.
అలాగే ఈ ఉత్సవాల్లో దసరాలో నటనకు గాను కీర్తి సురేష్ `ఉత్తమ నటి` అవార్డును అందుకుంది. ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్న తొలి చిత్ర దర్శకులుగా శ్రీకాంత్ ఓదెల (దసరా), శైర్యువ్ (హాయ్ నాన్న) చరిత్ర సృష్టించారు. శ్రీకాంత్ ఓదెల తన మొదటి సినిమాతోనే 100 కోట్లు పైగా గ్రాస్‌ను సాధించాడు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, కొరియోగ్రఫీ విభాగాల్లో సత్యన్ సూర్యన్, అవినాష్ కొల్లా, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ వరుసగా అవార్డులు గెలుచుకున్నారు. తన దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హాయ్ నాన్న దర్శకుడు శౌర్యువ్ విజయాలను పురస్కరించుకుని అవార్డు కార్డులను రూపొందించనున్నట్లు నాని ఈ వేదికపై ప్రకటించారు.
`బలగం` సినిమా ఉత్తమ చిత్రంగా అవార్డును గెలుచుకోగా, ఈ సినిమాకి దర్శకత్వం వహించిన కమెడియన్ వేణు ఎల్దండి కి ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ దక్కింది. బేబిలో నటనకు గాను ఉత్తమ నటి(క్రిటిక్స్)గా వైష్ణవి పురస్కారం అందుకుంది. సాయి రాజేష్ తెరకెక్కించిన బేబికి ఉత్తమ చిత్రంగా క్రిటిక్స్ పురస్కారం దక్కింది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా ముగ్గురు చిన్ననాటి స్నేహితుల కథ. రాజకీయాలు, అధికారం చుట్టూ పరిస్థితుల వల్ల ఎలా మారారు అన్నదే సినిమా. దసరా వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ విజయాన్ని సాధించింది. బలగం ప్రపంచవ్యాప్తంగా 117.50 కోట్లు వసూలు చేసింది. నాని పాత్రకు ధరణి అని పేరు పెట్టగా, కీర్తి వెన్నెల పాత్రలో నటించింది.
ఫిలింఫేర్ 2024 విజేతల జాబితా(తెలుగు):
ఉత్తమ చిత్రం: బలగం
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) : సాయి రాజేష్ (బేబీ)
ఉత్తమ దర్శకుడు: వేణు యెల్దండి (బలగం)
ఉత్తమ నూతన దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్ నాన్న)
ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు (పురుషుడు) : నాని (దసరా)
ఉత్తమ నటుడు (విమర్శకులు) : ప్రకాష్ రాజ్ (రంగ మార్తాండ), నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి- మిస్టర్ పోలిశెట్టి)
ప్రధాన పాత్రలో ఉత్తమ నటి (మహిళ) : కీర్తి సురేష్ (దసరా)
ఉత్తమ నటి (క్రిటిక్స్) : వైష్ణవి చైతన్య (బేబీ)
ఉత్తమ సహాయ నటుడు (పురుషుడు) : బ్రహ్మానందం (రంగ మార్తాండ), రవితేజ (వాల్తేరు వీరయ్య)
ఉత్తమ సహాయ నటి (మహిళ) : రూపా లక్ష్మి (బలగం)
ఉత్తమ తొలి నటుడు: సంగీత్ శోభన్ (పిచ్చి)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్: బేబీ (విజయ్ బుల్గానిన్)
ఉత్తమ సాహిత్యం: అనంత శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘలీలా - బేబీ)
ఉత్తమ నేపథ్య గాయకుడు (పురుషుడు) : శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘలీలా - బేబీ)
ఉత్తమ నేపథ్య గాయని (మహిళ) : శ్వేతా మోహన్ (మాస్టారు మాష్టారు - సర్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ (దసరా)
ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్ (ధూమ్ ధామ్ దోస్తాన్ - దసరా)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కొల్లా అవినాష్ (దసరా)