మన దగ్గర హిందీ హీరోల రికార్డులు.. యానిమాల్ కొట్టేనా?
అన్నిటికంటే ముఖ్యంగా రణబీర్ కపూర్ యానిమల్ సినిమా కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ పై దూకుడు చూపించే ఛాన్స్ లేకపోలేదు.
By: Tupaki Desk | 29 Sep 2023 2:30 AM GMTఒకప్పుడు బాక్స్ ఆఫీస్ రికార్డులు అనగానే అందరూ కూడా బాలీవుడ్ వైపు తిరిగేవారు. కానీ మెల్లమెల్లగా బాలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ కూడా అందుకు తగ్గట్టుగా రికార్డులను క్రియేట్ చేయగలదు అని చాలా సినిమాలు నిరూపించాయి. అయితే ఇప్పుడు సౌత్ మార్కెట్లో ముఖ్యంగా తెలుగు మార్కెట్ పై హిందీ హీరోల ఫోకస్ ఎక్కువగా పడింది.
ఇక్కడ ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేసే వరకు వచ్చారు. అవసరమైతే తెలుగు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాక తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పటివరకు బాలీవుడ్ లో నుంచి వచ్చిన సినిమాలలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల లెక్కలు ఈ విధంగా ఉన్నాయి.
బ్రహ్మాస్త్ర 1 సినిమా ఏపీ తెలంగాణలో 31 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని మొన్నటి వరకు నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. అయితే ఆ తర్వాత పటాన్ సినిమా ఆ రికార్డును బ్రేక్ చేసి 56 కోట్లను అందుకుంది. ఇక రీసెంట్ గా వచ్చిన షారుఖాన్ మరో సినిమా జవాన్ ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 76 కోట్లను రాబట్టింది.
ఇప్పుడు ఈ లిస్టులో షారుక్ ఖాన్ వరుసగా రెండు రికార్డులతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక అతని నుంచి రాబోయే డంకీ సినిమా కూడా ఈ రికార్డులు బ్రేక్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే సల్మాన్ ఖాన్ టైగర్ 3 తో కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించగలడు. అన్నిటికంటే ముఖ్యంగా రణబీర్ కపూర్ యానిమల్ సినిమా కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ పై దూకుడు చూపించే ఛాన్స్ లేకపోలేదు.
ఎందుకంటే ఈ సినిమాను అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరపైకి తీసుకువస్తున్నాడు. కాబట్టి అతనికి క్రేజ్ బట్టి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. దిల్ రాజు ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తూ ఉండడం విశేషం. ఆయన దాదాపు అన్ని భాషల్లో ఇక్కడ విడుదల చేసేందుకు 30 కోట్లకు పెట్టుబడి పెట్టారు. ఇక యానిమల్ హడావిడి చూస్తూ ఉంటే తప్పకుండా ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.