Begin typing your search above and press return to search.

డెడ్ పూల్ అండ్ వాల్వరిన్… 3 రోజులు కలెక్షన్స్ ఎంతంటే?

హాలీవుడ్ నుంచి వచ్చే సూపర్ హీరో సినిమాలకు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంటుంది.

By:  Tupaki Desk   |   29 July 2024 11:26 AM GMT
డెడ్ పూల్ అండ్ వాల్వరిన్… 3 రోజులు కలెక్షన్స్ ఎంతంటే?
X

హాలీవుడ్ నుంచి వచ్చే సూపర్ హీరో సినిమాలకు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంటుంది. కొన్ని సూపర్ హీరో పాత్రలకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మార్వెల్ స్టూడియోస్ తన సూపర్ హీరో వెంచర్ నుంచి చాలా సినిమాలను ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చి బ్లాక్ బాస్టర్ అందుకున్నారు. తాజాగా డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ సినిమాని మార్వెల్ స్టూడియోస్ నుంచి మరో సూపర్ హీరోస్ మూవీగా జులై 26న రిలీజ్ అయ్యింది.


ఎక్స్ మెన్ సిరీస్ తో అందరికి సుపరిచితమైన వాల్వరిన్ ఈ చిత్రంలో ఒక సూపర్ హీరోగా చేశాడు. డెడ్ పూల్ మూవీలో సూపర్ హీరో క్యారెక్టర్ కూడా ఈ చిత్రంలో కంటిన్యూగా ఉంది. ఈ రెండు పాత్రలను కలిపి ఈసారి హై వోల్టేజ్ సూపర్ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

అయితే సూపర్ హీరో చిత్రాలకు వరల్డ్ వైడ్ గా ఉన్న ఆదరణ నేపథ్యంలోనూ ఫస్ట్ వీకెండ్ లో ఈ మూవీ ఏకంగా 3650 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కేవలం మొదటి మూడు రోజుల్లోనే ఈ స్థాయిలో వసూళ్లు అందుకుందంటే ఏ రేంజ్ లో సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే శని, ఆదివారాలు కూడా థియేటర్స్ హౌస్ ఫుల్ అయినట్లు తెలుస్తోంది. ఇండియాలో కూడా సూపర్ హీరో చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చే సినిమాలకి మంచి ప్రేక్షకాదరణ లభిస్తూ ఉంటుంది.

డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ సినిమాకి కూడా అదే స్థాయిలో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ మూవీ డబ్బింగ్ వెర్షన్ కి మల్టీప్లెక్స్ థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తుందంట ముఖ్యంగా తెలుగు వెర్షన్ లో కామెడీ బాగా వర్క్ అవుట్ అయినట్లు ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. డైలాగ్స్ కూడా అద్భుతంగా సెట్ అయ్యాయని అంటున్నారు.

ఇదే జోరు కొనసాగితే తెలుగులో కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్స్ రాబడుతుందని డిస్ట్రిబ్యూటర్స్ భావిస్తున్నారు. వీకెండ్ తర్వాత ఈ చిత్రానికి ఏ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయనేది మూవీ లాంగ్ రన్ రికార్డ్స్ పైన ఆధారపడి ఉంటుంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన సినిమాలలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రాలలో టాప్ లో అవెంజర్స్ ఎండ్ గేమ్, రెండో స్థానంలో అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఉన్నాయి.

ఈ కలెక్షన్స్ రికార్డుని తర్వాత వచ్చిన మార్వెల్ సిరీస్ మూవీలు ఇవి కూడా అందుకోలేకపోయాయి. డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ చిత్రానికి ప్రస్తుతం వస్తున్న ఆదరణ చూస్తుంటే కచ్చితంగా మంచి వసూళ్లని రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే అవి ఏ స్థాయిలో ఉంటాయనేది వీక్ డేస్ వచ్చే కలెక్షన్స్ బట్టి తెలిసే ఛాన్స్ ఉంది.