Begin typing your search above and press return to search.

ఆ బ్యాన‌ర్ ప్రాధాన్య‌త తెలుగ‌మ్మాయిలా?

ఓ అగ్ర బ్యాన‌ర్ కి అనుబంధంగా ఏర్ప‌డిన ఓ సంస్థ‌లో ఇక‌పై ముందు ప్రాధాన్య‌త తెలుగు అమ్మాయిల‌కు ఇవ్వాల‌ని భావిస్తున్నారు

By:  Tupaki Desk   |   3 Aug 2023 5:30 PM GMT
ఆ బ్యాన‌ర్ ప్రాధాన్య‌త తెలుగ‌మ్మాయిలా?
X

ఇటీవ‌లే ఓ స్టార్ హీరో..ఆయ‌న తండ్రి...ఆ కుటుంబానికి చెందిన కొంద‌రు ప్ర‌ముఖులు ఓ తెలుగు న‌టి ప‌నిత‌నాన్ని ఏ రేంజ్ లో ప్ర‌శంసించారో తెలిసిందే. తెలుగమ్మాయిలు ప‌రిశ్ర‌మ‌కి రావాల‌ని..ఇక్క‌డ అవ‌కాశాలుంటాయ‌ని..భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని వ‌చ్చి సినిమాలు చేసుకుని వెళ్లండ‌ని భ‌రోసా క‌ల్పించారు. మ‌రి ఇప్పుడా స్టార్ హీరో కుటుంబానికి చెందిన బ్యాన‌ర్ తెలుగు అమ్మాయిల‌కు మొద‌టి ప్రాధాన్య‌త ఇవ్వ‌బోతుందా? అంటే అవున‌నే లీకులందుతున్నాయి.

ఓ అగ్ర బ్యాన‌ర్ కి అనుబంధంగా ఏర్ప‌డిన ఓ సంస్థ‌లో ఇక‌పై ముందు ప్రాధాన్య‌త తెలుగు అమ్మాయిల‌కు ఇవ్వాల‌ని భావిస్తున్నారు. తెలుగు అమ్మాయిలు ఎంత మంది వ‌చ్చినా న‌చ్చిన వారిని ఎంపిక చేసి ఆడిష‌న్ చేసి..ఆ త‌ర్వాత ఒక‌ర్నీ ఫైన‌ల్ చేసే దిశ‌గా ఆలోచ‌న చేస్తున్నారుట‌. వాళ్ల‌లో ఎవ‌రూ ఆ పాత్ర‌కి సూట‌వ్వ‌క పోతే గ‌నుక అప్పుడు ఇత‌ర భాష‌ల మోడ‌ల్స్ వైపు చూడాల‌ని భావిస్తున్నారుట‌. అలాగ‌ని ఆ బ్యాన‌ర్ కేవ‌లం తెలుగు అమ్మాయిల‌కే అంకిమైపోలేదుట‌.

ఇదంతా క‌థ‌..హీరో ఇమేజ్ మీద ఆధారప‌డి ఉంటుంద‌ని తెలుస్తోంది. ఏ హీరోయిన్ తీసుకుంటే బాగుం టుం ద‌న్న‌ది ముందుగా ఆ చిత్ర ద‌ర్శ‌కుడితో చ‌ర్చించి ఆ త‌ర్వాత తుది నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలు స్తోంది. ఎందుకంటే క‌థ రాసిన ద‌ర్శ‌క‌-ర‌చ‌యిత‌ల‌దే న‌టీన‌టుల ఎంపిక‌. ఆ క‌థ‌కి స్టార్ హీరోయిన్ అవ‌సరం అనుకుంటే ఆ రేంజ్ ఉన్న నాయిక‌నే దించుతారు. అలా కాకుండా కొత్త న‌టి అయినా ప‌ర్వాలేదు.. సినిమాకి న్యాయం చేయ‌గ‌ల‌దు అని ద‌ర్శ‌కుడు భావిస్తే అప్పుడు చాయిస్ తెలుగ‌మ్మా యిల‌కు ఉంటుంద‌ని తెలుస్తోంది.

మొత్తానికి టాలీవుడ్ లో ఆ బ్యాన‌ర్ తెలుగు అమ్మాయిల విష‌యంలో ఓ మంచి మూవ్ మెంట్ తీసుకు న్న‌ట్లు క‌నిపిస్తోంది. తెలుగు న‌టులు రావాల‌న్నా? సినిమాలు చేయాల‌న్నా? నిరూపించుకోవాలన్నా? ముందు ఓ వేదిక కావాలి. ఆ ప్లాట్ ఫాంని స‌ద‌రు నిర్మాణ సంస్థ అందిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

తెలుగు న‌టీమ‌ణులు ఇప్పుడెంతో మారారు. ఒక‌ప్ప‌టిలా హ‌ద్దులు..గీత‌లు గీసుకుని కూర్చోవ‌డం లేదు. ముంబై మోడ‌ల్స్ కి ఏమాత్రం త‌క్కువ కాద‌ని ఛాన్స్ దొరికిన‌ప్పుడ‌ల్లా నిరూపిస్తున్నారు. అందుకు స‌రైన వేదిక ఒక్క‌టి దొరికితే చాలు. ట్యాలెంట్ చూపిస్తున్నారు.