Begin typing your search above and press return to search.

ఇద్దరి ప్రేమలో సిద్దు జొన్నలగడ్డ.. 'తెలుసు కదా'

స్టార్ బోయ్ సిద్దు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్బంగా స్పెషల్ సర్ ప్రైజ్ వచ్చేసింది. నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది.

By:  Tupaki Desk   |   7 Feb 2025 7:43 AM GMT
ఇద్దరి ప్రేమలో సిద్దు జొన్నలగడ్డ.. తెలుసు కదా
X

స్టార్ బోయ్ సిద్దు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్బంగా స్పెషల్ సర్ ప్రైజ్ వచ్చేసింది. నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ ను చూస్తుంటే ప్రేక్షకులను ఒక అందమైన ప్రేమ కథలోకి తీసుకెళ్లేలా ఉంది. ఇందులో సిద్దు మరింత స్టైలిష్‌గా, స్మార్ట్‌గా కనిపిస్తుండటం అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది.


ఈ సినిమాలో లవ్ ట్రయాంగిల్ అంశం కీలకంగా మారనుందని పోస్టర్‌తో అర్థమవుతోంది. పోస్టర్ పై భాగంలో సిద్దు, శ్రీనిధి శెట్టి మధ్య ఉన్న రొమాంటిక్ కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది. మరోవైపు, రాశీ ఖన్నా ముద్దిచ్చే సన్నివేశం ముద్దుగా అనిపిస్తోంది. ఈ రెండు లుక్స్ కూడా సినిమాలో కథ ఎలా ఉండబోతోందో గట్టి క్లారిటీ ఇస్తున్నాయి. సిద్దు లవ్ లైఫ్‌లో ఏం జరుగుతుందనే అంశంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సంగీతం తమన్ అందించగా, గ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. పోస్టర్ రిలీజుతో పాటు త్వరలోనే చిత్రబృందం థియేట్రికల్ రిలీజ్ డేట్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

సిద్దు గతంలో ‘డీజే టిల్లు’తో భారీ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోరును కొనసాగిస్తూ రొమాంటిక్ ఎంటర్టైనర్‌లో అలరించేందుకు సిద్ధమయ్యాడు. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా ఇద్దరు హీరోయిన్‌లు కావడంతో సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. వీరి మధ్య ఎలాంటి ప్రేమ కథ నడుస్తుందనే అంశం సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారనుంది.

ఈ సినిమాలో వైవా హర్ష కీలక పాత్రలో కనిపించనుండటంతో మరింత ఫన్ యాంగిల్ కూడా ఉండబోతోందని ఊహించవచ్చు. పాటలు, సినిమాటోగ్రఫీ హైలైట్‌గా నిలవనున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించి సినిమాపై మరింత క్రేజ్ తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సిద్దు కెరీర్‌కు ఈ సినిమా మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా, ఆయన స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయా? అన్నది తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాలి. అతి త్వరలోనే ‘తెలుసు కదా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.