Begin typing your search above and press return to search.

సిద్ధు ట్రైయాంగిల్ రొమాన్స్.. ఇద్దరితో ఇలా..

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘తెలుసుకాదా’ నుంచి మేకర్స్ కొత్త లుక్‌ను విడుదల చేశారు.

By:  Tupaki Desk   |   14 Feb 2025 5:42 AM GMT
సిద్ధు ట్రైయాంగిల్ రొమాన్స్.. ఇద్దరితో ఇలా..
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త తరహాలో క్రేజ్ అందుకుంటున్న వారిలో సిద్ధూ జోన్నలగడ్డ ఒకరు. కేవలం యూత్‌కే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటూ తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు. ‘డీజే టిల్లు’ వంటి సినిమాలతో హీరోగా క్రేజ్ సంపాదించుకున్న సిద్ధూ, ఇప్పుడు మరో సాలిడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు. ఆ సినిమా పేరు ‘తెలుసుకాదా’. ఈ సినిమా టైటిల్‌తోనే ఆసక్తి రేపుతోంది.


ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘తెలుసుకాదా’ నుంచి మేకర్స్ కొత్త లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సిద్ధూ జోన్నలగడ్డ ఒకరితో రొమాంటిక్‌గా ఉంటూ, మరో అమ్మాయిని చూస్తూ చిరునవ్వు చిందిస్తున్నారు. ఒకవైపు రాశీ ఖన్నా సిద్ధూకి కిస్ ఇస్తుండగా, మరోవైపు శ్రీనిధి శెట్టి అసహనంగా చూస్తూ కనిపించడం పోస్టర్‌ను మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చింది. ఈ లుక్ చూసినవారు సినిమా పక్కా లవ్ ట్రైయాంగిల్ అని అర్థం చేసుకుంటున్నారు.

ఇప్పటివరకు సిద్ధూ చేసిన సినిమాల్లో రొమాన్స్ కి ఓ ప్రత్యేకమైన హావభావం ఉంటుంది. ఆ రొమాన్స్‌లో డ్రామా, ఫన్, ఎమోషన్ అన్నీ మిక్స్ చేసి హైలెట్ చేశాడు. ఇక ఇప్పుడు ‘తెలుసుకాదా’తో సిద్ధూ మరోసారి తన స్టైల్ చూపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ఇద్దరూ అద్భుతమైన నటీమణులు కావడంతో, ఈ సినిమాలో వారి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది.

ఈ సినిమా ద్వారా ప్రముఖ స్టైలిస్ట్ రైటర్ నీరజా కోనా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. నీరజా కోనా టాలీవుడ్‌లో పలు స్టార్ హీరోల సినిమాలకు స్టైలిస్ట్‌గా పని చేశారు. ఆమె దర్శకత్వం వహిస్తున్న మొదటి సినిమా కావడంతో, నీరజా ఎలాంటి కథను సిద్ధూకు ఇచ్చారో అన్నది పెద్ద క్వశ్చన్ గా మారింది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

సిద్ధూ జోన్నలగడ్డ సినిమాల్లో డైలాగ్స్, కామెడీ టైమింగ్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా యువతలో సిద్ధూకి ఉన్న క్రేజ్ వల్ల ‘తెలుసుకాదా’పై భారీ అంచనాలు ఉన్నాయి. అందులోను లవ్ ట్రైయాంగిల్ జానర్‌లో సినిమాలు తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతారు. ఈ సినిమాలో సానుకూలమైన ఎమోషన్లు, సున్నితమైన ప్రేమ భావనలు ఉంటాయని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో టీజర్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్‌తోనే హైప్ పెంచిన మేకర్స్, త్వరలోనే మరో క్రేజీ అప్డేట్ ఇస్తారని సమాచారం.