Begin typing your search above and press return to search.

ఆగస్టు నుంచే తెలుసు కదా..!

యంగ్ స్టార్‌ హీరో సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు

By:  Tupaki Desk   |   17 July 2024 5:55 AM GMT
ఆగస్టు నుంచే తెలుసు కదా..!
X

యంగ్ స్టార్‌ హీరో సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. డీజే టిల్లు తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న సిద్దు ఈ సారి గ్యాప్ రానివ్వడం లేదు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

ఇటీవలే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన దర్శకత్వంలో ఒక సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది. సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నీరజ కోన దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

సాధారణంగా సిద్దు తన సినిమాల యొక్క స్క్రిప్ట్‌ ల విషయంలో తానే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. నీరజ కోన చెప్పిన స్క్రిప్ట్‌ చాలా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడట. ఈ సినిమాకు తెలుసు కదా అనే టైటిల్‌ ను కన్ఫర్మ్‌ చేయడం జరిగింది.

భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చకచక జరుగుతున్నాయి. తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మరో రెండు మూడు వారాల్లో అంటే ఆగస్టు లో తెలుసు కదా సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వబోతుంది.

సిద్దు ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్స్ నేపథ్యంలో తెలుసు కదా సినిమాను చాలా స్పీడ్‌ గా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది సమ్మర్ వరకు సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. పీపుల్స్ మీడియా బ్యానర్‌ లో రూపొందుతున్న 30వ సినిమా అవ్వడంతో అందరి దృష్టి ఈ సినిమా పై ఉండే అవకాశం ఉంది.