TV వరల్డ్ లో ఎన్టీఆర్ నెంబర్ 1 TRP.. టాప్ లిస్ట్ ఇదే!
కానీ, ఒక సినిమాకు వస్తున్న టీఆర్‌పీ రేటింగ్ దశాబ్దం దాటినా తిరుగులేకుండా కొనసాగడం నిజంగా అరుదైన విషయం.
By: Tupaki Desk | 14 March 2025 5:22 PM ISTతెలుగు సినిమా ఏ రేంజ్ లో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందో, టెలివిజన్ స్క్రీన్‌పై కూడా అంతే ప్రభావం చూపుతోంది. థియేటర్లలో గ్రాండ్ సక్సెస్ సాధించిన సినిమాలు, బుల్లితెరపై టీఆర్‌పీ రేటింగ్స్‌తో అదరగొట్టడం చూస్తూనే ఉన్నాం. కానీ, ఒక సినిమాకు వస్తున్న టీఆర్‌పీ రేటింగ్ దశాబ్దం దాటినా తిరుగులేకుండా కొనసాగడం నిజంగా అరుదైన విషయం. అందుకు ఉదాహరణగా నిలిచిన చిత్రం.. "టెంపర్".
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే కీలకమైన సినిమాగా నిలిచిన టెంపర్, బుల్లితెరపై ఇప్పటికీ సత్తా చాటుతూనే ఉంది. 2015లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో మంచి హిట్‌గా నిలిచింది. కానీ, అసలు మ్యాజిక్ టీవీ స్క్రీన్‌పై రిపీట్ టెలికాస్ట్‌లలో కనిపించింది. తొలి ప్రసారం నుంచే 29.8 టీఆర్‌పీ సాధించి రికార్డు స్థాయిలో నిలిచిపోయింది. ఇప్పటి వరకు ఈ రికార్డును ఏ సినిమా కూడా అధిగమించలేదు.
ఇక టీఆర్‌పీ టాప్ 5 జాబితాలో అల్లుఅర్జున్ సినిమా "అల వైకుంఠపురములో" 29.4 టీఆర్‌పీతో రెండో స్థానంలో నిలవడం విశేషం. స్టైలిష్ స్టార్ క్రేజ్, త్రివిక్రమ్ మేజిక్, థమన్ మ్యూజిక్ కలిసి ఈ సినిమాను టెలివిజన్ స్క్రీన్‌పై కూడా మాస్ హిట్‌గా నిలిపాయి. అంతేకాదు, ఈ జాబితాలో అల్లు అర్జున్ నటించిన మరో మూవీ "పుష్ప 1" కూడా 25.2 టీఆర్‌పీతో చోటు సంపాదించుకుంది.
అభిమాన నటుల సినిమాలు టీవీ స్క్రీన్‌పై ఎంతటి ప్రభావం చూపుతాయో, నాగార్జున నటించిన "శ్రీరామదాసు" కూడా నిరూపించింది. భక్తి రసంతో నిండిన ఈ సినిమా 24 టీఆర్‌పీ సాధించి తెలుగు ఆడియెన్స్ ప్రేమను చూరగొంది. అప్పట్లో ఇదే ఆల్ టైమ్ హయ్యెస్ట్ రికార్డుగా నిలిచింది. అదే విధంగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన "మగధీర" కూడా 24 టీఆర్‌పీ రేటింగ్‌తో టాప్ 5లో నిలిచింది.
సినిమాల హిట్ రేంజ్‌ను తేల్చే విధంగా మారిన టీఆర్‌పీ రేటింగ్స్ లో ఇంకా ఎన్టీఆర్ సినిమాలదే హవా. గత దశాబ్ద కాలంగా టెంపర్ హైయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకొని తిరుగులేని రికార్డు సాధించడం విశేషం. మరి, రాబోయే రోజుల్లో ఈ రికార్డును ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి.
టాప్ 5 TRP రికార్డ్స్
టెంపర్ - 29.8
అల వైకుంఠపురములో.. - 29.4
పుష్ప 1 - 25.2
శ్రీరామదాసు - 24
మగధీర - 24