హమ్మయ్యా టాలీవుడ్‌కు ఓ టెన్షన్ తీరింది
ఎందుకంటే ఇప్పటివరకు డిసెంబర్ మొదటి వారంలో రావాలనుకున్న సినిమాలు.. ఈ ఎన్నికల తేదీ పక్కాగా తెలీక.. ఎప్పుడు రావాలో అని కాస్త సందిగ్ధంలో పడ్డారు
By: Tupaki Desk | 9 Oct 2023 11:56 AM GMTదేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన తెలంగాణ ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30న పోలింగ్ మొదలై.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియతో ముగుస్తుంది. దీంతో ఇక రాష్ట్రంలో అభ్యర్థుల ప్రచారాలు, ఆర్భాటాలు, టికెట్ల పంపకాలు, సభలు, ఊరేగింపులు విపరీతమైన సందడి నెలకొననుంది. అయితే ఎన్నికల కమిషన్ ఈ డేట్లను అనౌన్స్ చేశాక.. టాలీవుడ్ దర్శకనిర్మాతలకు ఓ టెన్షన్ తీరిపోయింది.
ఎందుకంటే ఇప్పటివరకు డిసెంబర్ మొదటి వారంలో రావాలనుకున్న సినిమాలు.. ఈ ఎన్నికల తేదీ పక్కాగా తెలీక.. ఎప్పుడు రావాలో అని కాస్త సందిగ్ధంలో పడ్డారు. కానీ ఇప్పుడదీ తీరిపోయింది. నవంబర్ రెండో వారంలో టైగర్ 3, మూడో వారంలో ఆనంద్ దేవరకొండ గంగం గణేశా, మంగళరవారం, స్పార్క్ , నవంబర్ 24న కల్యాణ్ రామ్ డెవిల్ రిలీజయ్యాక చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. టిల్లు స్క్వేర్ అనుకున్నారు కానీ అది వచ్చేలా లేదు. ఇక అప్పటికే ఆ సమయంలో ఎన్నికల హడావుడి ఉంటుంది కాబట్టి.. అప్పుడు సినిమాలేమీ రాకపోవచ్చు.
డిసెంబర్ 1 యానిమల్ మాత్రమే రాబోతుంది. ఆ సినిమాకు పెద్దగా ఎఫెక్ట్ పడదు. అప్పటికే పోలింగ్ అయిపోతుంది. ఇక మూడో తేదీ మాత్రం కౌంటింగ్ కాబట్టి.. అప్పుడు కాస్త వసూళ్లకు కాస్త ఎఫెక్ట్ ఉంటుంది. ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత.. కొత్త సినిమాల సందడి మొదలు కానుంది. డిసెంబర్ 8న నితిన్ ఎక్స్ట్రా ఆర్డీనరీ థియేటర్లలో రిలీజ్ కానున్నట్లు ప్రకటన వచ్చేసింది.
వెంకటేశ్ సైంధవ్, నాని హాయ్ నాన్న కూడా డిసెంబర్ తొలి వారం అన్నారు కానీ అవి వచ్చేలా లేవు. సైంధవ్ జనవరికి పోస్ట్ పోన్ అంటున్నారు. హాయ్ నాన్నపై క్లారిటీ లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి అంటున్నారు. అయితే ఎక్స్ట్రా ఆర్డీనరీకి పోటీకి విశ్వక్ సేన గ్యాంగ్స్ ఆఫ్స్ గోదావరి వచ్చే అవకాశముందని ఫిల్మ్ వర్గాలు టాక్. ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు.
ఇక డిసెంబర్ 22 నుంచి సలార్ హడావుడి మొదలవుతుంది. టికెట్ రేట్లు, అదనపు షోల పర్మిషన్లన్నీ కొత్త ప్రభుత్వమే చూసుకుంటుంది. ఇక సంక్రాంతి నాటికి అంతా నార్మలైపోతుంది. సో కూల్‌గా ఉండొచ్చు.