నయన్ ట్రైలర్ 'టెస్ట్'.. పాసయినట్లేనా..
'టెస్ట్' అనే టైటిల్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు.
By: Tupaki Desk | 26 March 2025 7:50 AMనయనతార, మాధవన్, సిద్ధార్థ్ వంటి సీనియర్ స్టార్లు కలిసి ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటించడం విశేషమే. 'టెస్ట్' అనే టైటిల్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ ను చూస్తే ఇది కేవలం క్రికెట్ గురించే కాదు... జీవితం పెట్టే పరీక్షల గురించి అని అర్థమవుతోంది. ట్రైలర్ మొదటి ఫ్రేమ్ నుంచే క్యారెక్టర్స్ ఎమోషన్‌లతో మనల్ని అనుసంధానం చేస్తుంది.
నయనతార తన భర్తగా మాధవన్‌ను, తన అభిమాన క్రికెటర్‌గా సిద్ధార్థ్‌ను పరిచయం చేస్తుంది. ఇక మూడు ప్రధాన పాత్రల మధ్య డైనమిక్స్ స్పష్టంగా చూపిస్తూ, ఒక కుటుంబ కథనం, వ్యక్తిగత కలలు, సామాజిక బాధ్యత.. అన్నింటినీ కలిపిన ఆసక్తికరమైన నేపథ్యాన్ని రూపొందించినట్లు హైలెట్ చేశారు. ముఖ్యంగా మాధవన్ పాత్ర శరవణన్.. దేశం కోసం పొల్యూషన్ లేని వాహనాలపై పరిశోధన చేస్తుంటే, అతనికి ఎదురయ్యే అవమానాలు, రాజకీయ లబ్దిదారులతో తట్టుకునే పోరాటం నెట్టుబెట్టి చూపించబడింది.
మరోవైపు, సిద్ధార్థ్ పాత్ర అర్జున్.. భారత క్రికెట్ టీమ్‌లో స్థానం కోసం పోరాడుతున్న ఆటగాడు. అతనికీ టెస్టుల్లోని స్కోరు కన్నా ఎక్కువగా జీవిత పరీక్షలు ఎదురవుతున్నాయి. ఈ రెండు పాత్రల మధ్య నయనతార ‘కుముద’గా కనెక్ట్ అవుతూ, ఆమె వ్యూహాల్లోని భావోద్వేగాలను ట్రైలర్‌లో హైలైట్ చేశారు. తల్లి కావడానికి ఆమె చేస్తే ప్రయత్నం చాలా ఎమోషనల్ గా ఉండనున్నట్లు అర్ధమవుతుంది.
టెక్నికల్‌గా చూస్తే ట్రైలర్ మ్యూజిక్ బాగుంది. బీజీఎమ్ ఎమోషన్‌ను హైటెన్ చేస్తోంది. విజువల్స్ స్టైలిష్‌గా ఉండేలా మలచారు. మూడు ప్రధాన పాత్రలు, మూడు విభిన్న కోణాలు.. ఒకటి ఆటగాడి కల, రెండు శాస్త్రవేత్త ఆశ, మూడవది ఓ మహిళా కోణం. ఈ మూడింటినీ కలిపి, "హీరో ఎవరు, విలన్ ఎవరు?" అనే ప్రశ్నను తలెత్తిస్తుంది.
ఈ ట్రైలర్ చూస్తే 'టెస్ట్' అనే టైటిల్‌కు ఉన్న డిప్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇది ఆటగాడి టెస్ట్ మ్యాచు కాదు, జీవితమే అతనికి టెస్ట్. మాధవన్, సిద్ధార్థ్, నయనతార ముగ్గురి పెర్ఫార్మెన్స్ అంచనాలు పెంచేలా ట్రైలర్ కట్ జరిగింది. ఏప్రిల్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా... కచ్చితంగా ఓ డిఫరెంట్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా నిలవనుందని ఈ ట్రైలర్ స్పష్టంగా చెబుతోంది. మరి ఫుల్ సినిమా కాంటెంట్ ఈ రేంజ్ లోనే ఆకట్టుకుంటుందో చూడాలి.