Begin typing your search above and press return to search.

మిస్టర్ బచ్చన్ మేకర్స్.. ఈ సినిమాలు క్లిక్కయ్యేనా?

సినీ నిర్మాణ రంగంలో జెట్ స్పీడ్ లో వెళుతున్న నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

By:  Tupaki Desk   |   2 Oct 2024 10:30 AM GMT
మిస్టర్ బచ్చన్ మేకర్స్.. ఈ సినిమాలు క్లిక్కయ్యేనా?
X

సినీ నిర్మాణ రంగంలో జెట్ స్పీడ్ లో వెళుతున్న నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఆయన ఒక ఫ్యాక్టరీ మోడల్‌లో సినిమాలు చేయాలనే సంకల్పంతో ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ను ప్రారంభించారు. ఈ సంస్థ గతంలో ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించింది, అందులో 'కార్తికేయ 2' ఒక ప్రధాన విజయం, ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా లభించింది.

కానీ, ఇదే సమయంలో, ఈ సంస్థ నుండి వచ్చిన మరికొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం ఒక పెద్ద నష్టంగా మారింది. గత కొన్నాళ్లుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి సరైన సక్సెస్ ఫుల్ రావడం లేదు. ఈగల్, మనమే, మిస్టర్ బచ్చన్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ముఖ్యంగా మిస్టర్ బచ్చన్ పెద్ద నష్టాలను మూటగట్టుకుంది.

ఈ సినిమా విషయంలో జరిగిన తప్పుల గురించి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా ఓపెన్ గానే చెప్పడం విశేషం. అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా మళ్ళీ పీపుల్ మీడియా సంస్థకి సరైన సక్సెస్ లు దక్కాలని ఆ టీమ్ ఆశిస్తోంది. అయితే ఈ నెలలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుండి రెండు ప్రధాన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

మొదట శ్రీవిష్ణు నటించిన 'SWAG' అక్టోబర్ 4న రానుంది. హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆసక్తి రేకెత్తించాయి. గతంలో రాజరాజ చోర సినిమాతో ఈ కాంబినేషన్ మంచి విజయాన్ని అందుకుంది, ఇప్పుడు 'స్వాగ్' తో మరోసారి అదే మ్యాజిక్‌ ను రిపీట్ చేయాలని చూస్తున్నారు.

ఇక మరో చిత్రం గోపీచంద్ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'విశ్వం'. ఈ సినిమా శ్రీను వైట్ల కు చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా. ట్రైలర్ చూస్తే, శ్రీను వైట్ల తన ప్రత్యేకమైన వినోదాన్ని ఈ సినిమాలో కూడా చూపించబోతున్నట్లు అనిపిస్తోంది. ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి, గోపీచంద్‌కి, శ్రీనువైట్లకి ఒక కీలక ప్రాజెక్ట్. ముగ్గురికి కూడా ఈ సినిమా విజయం చాలా అవసరం.

ఈ రెండు సినిమాల తర్వాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ప్రధానంగా 'రాజాసాబ్' సినిమా మీద భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ద్వారా పీపుల్ మీడియా ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుతుందని టీజీ విశ్వప్రసాద్ ఆశిస్తున్నారు. 'రాజాసాబ్' భారీ బడ్జెట్, అద్భుతమైన కథనంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి విజయాన్ని తెచ్చిపెట్టే సినిమాగా భావిస్తున్నారు.