పవన్ 'బ్రో' రెమ్యునరేషన్ అడిగే హక్కు ఆ ఇద్దరికే
మా సంస్థకు, పవన్ కల్యాణ్ గారికి ఉన్న ఒప్పందం గురించి అడిగే హక్కు ప్రపంచం లో ఎవడికి లేదు. ఇన్ కమ్ ట్యాక్స్ రిపోర్ట్ చేసుకునేటప్పుడు పవనే చేసుకుంటారు. మా ట్యాక్స్ ఫైలింగ్ చేసుకున్నప్పుడు మేము చేసుకుంటాం.
By: Tupaki Desk | 2 Aug 2023 5:58 AM GMTప్రస్తుతం టాలీవుడ్ లో రెండు చిత్రాల పేర్లే వినిపిస్తున్నాయి. ఒకటి 'బేబి' మరొకటి 'బ్రో'. 'బేబీ' కలెక్షన్లతో చర్చనీయాంశమవుతుంటే.. పవన్ కల్యాణ్ 'బ్రో' సినిమా వివాదాలతో హాట్ టాపిక్ గా మారింది. 'బ్రో' సినిమా లో ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ను కించపరిచేలా ఓ పాత్రను తీర్చిదిద్దారనే విషయం పై వాదనలు, ప్రతివాదనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలోనే 'బ్రో' సినిమా కు బ్లాక్ మనీ ఉపయోగించారని, పవన్ కల్యాణ్ కు పారితోషికం రూపం లో తేదేపా ముడుపులు అందినట్లుగా అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. దీని పై తాజాగా 'బ్రో' నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పష్టతనిచ్చారు. ఒకడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
"మేం ప్రొడక్షన్ లోకి వచ్చి ఐదేళ్లు అవుతుంది. ఇది ఒకరికి చెప్పాల్సి అవసరం లేదు. ఈ సినిమా కు ఎంత బడ్జెట్ అయిందనేది మాకు, జీటీవికి మాత్రమే తెలుసు. మా ఇద్దరికి తప్పితే ఈ ప్రపంచం లో ఇంకెవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు" అని టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు.
పవన్ రెమ్యునరేషన్ విషయానికొస్తే.. "మా సంస్థకు, పవన్ కల్యాణ్ గారికి ఉన్న ఒప్పందం గురించి అడిగే హక్కు ప్రపంచం లో ఎవడికి లేదు. ఇన్ కమ్ ట్యాక్స్ రిపోర్ట్ చేసుకునేటప్పుడు పవనే చేసుకుంటారు. మా ట్యాక్స్ ఫైలింగ్ చేసుకున్నప్పుడు మేము చేసుకుంటాం.
జీఎస్టీ రిపోర్ట్ చేస్తాం. అంతకుమించి ఎవ్వరికీ కూడా అడిగే అధికారం లేదు. నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం అస్సలే లేదు. రూమర్స్ అనేవి ఎలాగైనా ఉండొచ్చు. అలానే అవి ఎలాగైనా వస్తాయి" అని టీజీ విశ్వప్రసాద్ చెప్పుకొచ్చారు. కాగా, అప్పట్లో ఓ సారి ఈ సినిమా కు దాదాపు రూ.50కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు స్వయంగా పవనే చెప్పారు.
ఇకపోతే ఈ సినిమా చేయాలన్న విషయం పై 'హరిహర వీరమల్లు', 'వకీల్ సాబ్' కన్నా ముందుగానే చర్చలు జరిగాయని విశ్వప్రసాద్ అన్నారు. అయితే అన్ని అనుకున్నట్టు జరగడానికి, కుదరడానికి సమయం పడుతుందని చెప్పారు. అలా ఫిబ్రవరిలో తమకు 23 రోజుల పాటు పవన్ డేట్స్ దొరికాయని తెలిపారు. రాజకీయ ఆరోపణలు సీరియస్ గా తీసుకోవట్లేదని కూడా అన్నారు.