పెళ్లికి ముందు ఆ నటితో స్టార్ హీరో డీప్ లవ్
నిజానికి తళా నటి షాలినిని వివాహం చేసుకోక ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారు.
By: Tupaki Desk | 9 Jan 2025 4:18 AM GMTతళా అజిత్ స్టార్ డమ్, అసాధారణ మాస్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. తమిళనాడులో రజనీకాంత్, విజయ్ లకు సమానంగా ఫాలోయింగ్ ఉన్న స్టార్. గోకార్డింగ్, కార్ రేసింగ్ లోను అతడి అభిరుచి గురించి తెలిసిందే. ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతున్న కార్ రేసింగ్ టోర్నీలో అజిత్ తన టీమ్ తో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే అజిత్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానులు చాలా శోధన సాగిస్తున్నారు. అతడికి సంబంధించిన పాత విషయాలను ఆరాలు తీస్తున్నారు. నిజానికి తళా నటి షాలినిని వివాహం చేసుకోక ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారు.
అజిత్, షాలినిల సినిమా ప్రేమకథ అందరికీ తెలిసిన విషయమే అయినా అజిత్ జీవితంలో ఊహించని ట్విస్టులున్నాయి. షాలినిని పెళ్లి చేసుకునే ముందు అజిత్ అందాల కథానాయిక హీరా రాజగోపాల్‌ను పిచ్చిగా ప్రేమించాడనే విషయం బయటి ప్రపంచానికి అంతగా తెలియదు. ఈ జంట ప్రేమ వ్యవహారం, బ్రేకప్ గురించి తెలిసింది తక్కువ. అజిత్ - హీరా జంట `ప్రేమలేఖ` చిత్రంలో నటించారు. ఈ మ్యూజికల్ లవ్ స్టోరీలో దేవయాని కథానాయిక. అజిత్ ని వెంబడించి ప్రేమ పేరుతో విసిగించే అమ్మాయిగా హీరా ఆ చిత్రంలో అద్భుతంగా నటించింది. ఆ సినిమా సమయంలో ఆ ఇద్దరి ప్రేమాయణంపైనా చాలా ప్రచారం సాగింది.
షాలినిని కలవడానికి ముందు అజిత్ హీరా రాజగోపాల్‌తో సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. 90లలో తమిళనాడులో దీనిపై ఎక్కువగా చర్చ సాగింది. `కథల్ కొట్టై` సినిమా షూటింగ్ సమయంలో అజిత్, హీరా ప్రేమలో పడ్డారు. తదుపరి చిత్రం తోడరమ్‌లో కలిసి నటించినప్పుడు ఆ సంబంధం మరింత బలపడింది. అజిత్ కుమార్ హీరాకు లేఖలు రాశారు. వారు వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసారు. అజిత్ ప్రేమలేఖల్లో ఒకదానిని ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తాను చదివానని కూడా చెప్పాడు. ఈ జంట తదుపరి అడుగు వేసి వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారని తెలిపాడు.
అయితే హీరా - అజిత్ లవ్ కి ఆమె తల్లి విలన్ గా మారింది. తన కుమార్తె నటనా వృత్తిని ఇంత చిన్న వయస్సులోనే ముగించాలని హీరా తల్లి అనుకోలేదు. కారణం ఏదైనా హీరా ప్రవర్తన మారడంతో అజిత్ కి దూరమైంది. దీని ఫలితంగా 1998లో ఇద్దరూ విడిపోయారు. ఒక టాబ్లాయిడ్‌తో పాత ఇంటర్వ్యూలో అజిత్ ఈ బ్రేకప్ గురించి మాట్లాడుతూ...తామిద్దరం కలిసి జీవించామని, తనను చాలా ఇష్టపడ్డానని, కానీ ఇప్పుడు అంతా మారిపోయిందని ఆవేదన చెందాడు. ``తను ఎప్పుడూ ఒకేలా లేదు.. నిజానికి ఆమె మాదకద్రవ్యాల బానిస..`` అని వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత 1999లో అమర్ కలం సినిమాలో కలిసి మొదటిసారి పనిచేసినప్పుడు షాలినితో తొలి చూపులోనే ప్రేమలో పడ్డానని అజిత్ వెల్లడించాడు. మతాలు వేరైనా కానీ అజిత్- షాలిని 24 ఏప్రిల్ 2000న వివాహం చేసుకున్నారు. సెట్లో వికసించిన ప్రేమ పరిపక్వత చెంది చివరికి ఈ జంట ఒకటయ్యారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. షాలినికి సెట్లో జరిగిన ప్రమాదం సమయంలో అతడు తనను క్షణమైనా విడిచిపెట్టకుండా శ్రద్ధగా చూసుకోవడంతో అతడికి పడిపోయానని షాలిని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.