Begin typing your search above and press return to search.

త‌ళా అజిత్‌.. రెండో సారి కార్ రేస్ ప్ర‌మాదం

ఇదిలా ఉంటే, త‌ళా అజిత్ దుబాయ్ కార్ రేస్ త‌ర్వాత ఎస్టోరిల్‌లో జరిగే భారీ మోటార్‌స్పోర్ట్ రేసింగ్ ఈవెంట్ కోసం పోర్చుగల్‌లో ఉన్నాడు.

By:  Tupaki Desk   |   10 Feb 2025 8:04 AM GMT
త‌ళా అజిత్‌.. రెండో సారి కార్ రేస్ ప్ర‌మాదం
X

మోటార్‌స్పోర్ట్ ప్రియుడైన అజిత్ తాజా విడుదల `విదాముయార్చి`తో బాక్సాఫీస్ వద్ద ల‌క్ చెక్ చేసుకుంటున్నాడు. పొరుగు భాష‌ల్లో ఈ చిత్రం ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా, త‌మిళ‌నాడులో ఫ‌ర్వాలేద‌నిపించింది. విడుద‌లైన కేవ‌లం నాలుగు రోజుల్లో 60 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది.

ఇదిలా ఉంటే, త‌ళా అజిత్ దుబాయ్ కార్ రేస్ త‌ర్వాత ఎస్టోరిల్‌లో జరిగే భారీ మోటార్‌స్పోర్ట్ రేసింగ్ ఈవెంట్ కోసం పోర్చుగల్‌లో ఉన్నాడు. దాని కోసం శిక్షణ పొందుతున్నప్పుడు స్ప్రింట్ ఛాలెంజ్ లో భాగంగా శిక్షణా సెషన్‌లో పాల్గొంటున్నాడు. ప్రాక్టీస్ సెష‌న్స్ లో ట్రాక్ పై అత‌డు మ‌రోసారి ప్రమాదానికి గురయ్యాడు. అతడి కారు బాగా దెబ్బ తిన‌గా, మ‌రోసారి గాయాల భారిన ప‌డ‌కుండా బ‌య‌ట‌ప‌డ్డాడు. అత‌డు పూర్తిగా క్షేమంగా ఉన్నాడని తెలిసింది. ఈ ఎమోష‌న‌ల్ ఘట్టం త‌ర్వాత ఎకె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. అత‌డు దీనిని చిన్న ప్రమాదంగా అభివర్ణించాడు. తాను సుర‌క్షితంగా ఆరోగ్యంగా ఉన్నాన‌ని తెలిపాడు. ప్ర‌మాదం తరువాత తనకు లభించిన ప్రేమ, మద్దతుకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

``మేము మళ్ళీ మంచి టైమ్‌ని స్పెండ్ చేస్తున్నాం. ఒక చిన్న ప్రమాదంలో చిక్కుకున్నాము. అదృష్టవశాత్తూ.. ఎవరికీ ఏమీ జరగలేదు. మేం మళ్ళీ కార్ రేసులో గెలిచి మా గర్వాన్ని చాటుతాం. ప్రమాదంలో మద్దతుగా నిలిచిన‌ స్నేహితులకు కృతజ్ఞతలు..`` అని అన్నారు. అజిత్ రేసింగ్ ప్రమాదం ఎదుర్కోవడం ఇది రెండవసారి. గతంలో దుబాయ్ 24హెచ్‌ రేసింగ్ ఈవెంట్ కోసం ప్రాక్టీస్ సెషన్‌లో అతడి కారు నియంత్రణ కోల్పోయి బౌండరీని ఢీకొట్టింది. వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డికి వచ్చి అత‌డిని కాపాడారు. కార్ నుజ్జునుజ్జ‌యినా కానీ, అజిత్ ఎలాంటి గాయాలు లేకుండా బ‌య‌ట‌ప‌డ్డాడు. ఇప్పుడు రెండోసారి ప్రాక్టీస్ సెష‌న్స్ లో ప్రమాదం నుంచి అదృష్ట‌వ‌శాత్తూ బ‌య‌ట‌ప‌డ్డాడు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అజిత్ కుమార్ త‌దుప‌రి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ని విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నాడు. తాజా విడుదల విదాముయార్చి నాలుగు రోజుల్లోనే రూ. 62 కోట్లు వసూలు చేసింది. మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీకి గురైంది. ప్ర‌స్తుతం పైర‌సీ వీడియో అందుబాటులో ఉంది. అయినా త‌ళా అజిత్ అభిమానులు థియేట‌ర్ల‌లో సినిమాని వీక్షిస్తున్నారు.