అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'పై కొత్త కబురు
By: Tupaki Desk | 26 May 2024 2:30 PM GMTతళా అజిత్ బ్యాక్ టు బ్యాక్ మాస్ సినిమాలతో అభిమానుల ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఇదే కేటగిరీ. మార్క్ ఆంటోని దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా యూనిట్ తదుపరి కొనసాగింపు షెడ్యూల్ కోసం త్వరలో రష్యా వెళ్లనుంది. యాక్షన్-ప్యాక్డ్ డ్రామా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదలై ఆన్లైన్లో విపరీతమైన స్పందనను పొందింది. అజిత్ మాస్ లుక్ డ్రాగన్ టాట్టూలపై బోలెడంత చర్చ సాగింది. ఈ పోస్టర్ భారీ బజ్‌ను సృష్టించింది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం 2025 పొంగల్ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. బహు భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ అత్యంత అంచనాలతో కూడిన ప్రాజెక్ట్‌కి సంగీతం సమకూరుస్తున్నారు. టైటిల్ కి తగ్గట్టు అదిరిపోయే బీజీఎమ్ ని దేవీశ్రీ రెడీ చేస్తున్నారని తెలిసింది.
ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ లో తళా వేషధారణ యువతరంలో చర్చనీయాంశమైంది. తళా అజిత్ మరోసారి మాస్ అవతార్ లో కనిపిస్తున్నాడు. అతడు తన ఎనర్జీకి తగ్గ పాత్రలో నటిస్తున్నాడని అంతా భావించారు. ఆసక్తికరంగా అతడి చేతిపై డ్రాగన్ టాటూలు.. తొడుక్కున్న రంగురంగుల చొక్కాపైనా డ్రాగన్ లు కనిపించాయి. దీని అర్థం అతడికి డ్రాగన్ కంట్రీతో ఏదైనా సంబంధం ఉందనే ఊహాగానాలకు తెర తీసింది. ఈ పాత్ర అతడిలోని బ్యాడ్ ని బయటపెట్టింది. గుడ్ ఏమిటన్నది తెరపైనే చూడాలి.