Begin typing your search above and press return to search.

విజయ్ ఆఖరి సినిమా.. రంగంలోకి ముగ్గురు బడా దర్శకులు!

సోషల్ మీడియాలో వస్తున్న తాజా రూమర్ ప్రకారం, జయ నాయకన్ సినిమాలో ప్రముఖ తమిళ దర్శకులు లోకేష్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్ ప్రత్యేక గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నారట.

By:  Tupaki Desk   |   12 March 2025 1:40 AM IST
విజయ్ ఆఖరి సినిమా.. రంగంలోకి ముగ్గురు బడా దర్శకులు!
X

తమిళ సినిమా ఇండస్ట్రీలో తలపతి విజయ్ ఎప్పుడూ కొత్త ప్రయోగాలకు వెళతాడు. అయితే, ఇప్పుడు అతను చేస్తున్న జయ నాయకన్ సినిమా ప్రాధాన్యత కేవలం కమర్షియల్ లెవెల్‌కే పరిమితం కాకుండా, రాజకీయంగా కూడా ఒక పెద్ద పరిణామంగా మారుతోంది. విజయ్ ఇప్పటికే రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అతను పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా ఆయన సినీ కెరీర్‌కు ఓ గ్రాండ్ రికార్డుగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాను హెచ్. వినోద్ తెరకెక్కిస్తుండగా, ఇది బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికి ప్రేరణగా రూపొందించబడిన సినిమా అని సమాచారం. విజయ్ మునుపటి సినిమాలు మాస్ ఎలిమెంట్స్‌కు ఫోకస్ చేస్తే, ఈసారి ఎమోషనల్ యాక్షన్ డ్రామా చేయడం ఆసక్తికరంగా మారింది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, ఇతర కీలక పాత్రల్లో బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఉన్నారు.

అయితే, ఈ సినిమాపై ఇప్పుడు ఒక హైలైట్ గాసిప్ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వస్తున్న తాజా రూమర్ ప్రకారం, జయ నాయకన్ సినిమాలో ప్రముఖ తమిళ దర్శకులు లోకేష్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్ ప్రత్యేక గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నారట. వీరు తలపతి విజయ్ కెరీర్‌లో కీలకమైన దర్శకులు. మాస్టర్, లియో, మెర్సల్, బిగిల్, బీస్ట్ వంటి సినిమాలు విజయ్ కెరీర్‌లో పెద్ద విజయాలను అందించినవే.

ఇప్పుడు ఈ ముగ్గురు దర్శకులు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే, అది అభిమానులకు ఒక స్పెషల్ ట్రీట్ అవుతుంది. ఈ స్పెషల్ అపియరెన్స్ సాధారణంగా సినిమాకోసం చేయిస్తున్నారా లేక అది సినిమా ప్రమోషన్‌లో భాగంగా మాత్రమేనా అన్నది క్లారిటీ లేదు. అయితే, విజయ్ రాజకీయ ఎంట్రీ నేపథ్యంలో ఈ సినిమాలో ఆయనకు గ్రాండ్ సెండాఫ్ ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతోందని టాక్.

తమిళ సినీ ఇండస్ట్రీలో విజయ్ ఒక స్టార్‌గా స్థిరపడినా, ఇప్పుడు ఆయన రాజకీయంగా కొత్త దశలోకి అడుగుపెట్టబోతుండటంతో, సినిమా ఇండస్ట్రీలోని సన్నిహితులు ఈ సినిమాను ప్రత్యేకంగా మలచాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మ్యూజిక్ విషయంలో అనిరుధ్ రవిచందర్ ఎప్పటిలాగే మరోసారి తన మార్క్ చూపించబోతున్నాడు. గతంలో విజయ్‌కు కత్తి, మాస్టర్, లియో వంటి హిట్స్ ఇచ్చిన అనిరుధ్, ఇప్పుడు జయ నాయకన్ కోసం పవర్‌ఫుల్ ఆల్బమ్ అందిస్తున్నట్లు సమాచారం. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తలపతి విజయ్ కెరీర్‌లో జయ నాయకన్ ఎంత పెద్ద విజయాన్ని అందుకుంటుందో చూడాలి.