Begin typing your search above and press return to search.

గోట్ వర్సెస్ OG.. అది మన పవర్ రేంజ్..!

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ గోట్ (G.O.A.T) గురువారం రిలీజైంది.

By:  Tupaki Desk   |   6 Sep 2024 9:02 AM GMT
గోట్ వర్సెస్ OG.. అది మన పవర్ రేంజ్..!
X

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ గోట్ (G.O.A.T) గురువారం రిలీజైంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ ఆడియన్స్ కు ఎక్కేసింది కానీ తెలుగులో మాత్రం అంత గొప్ప టాక్ తెచ్చుకోలేదు. విజయ్ డ్యుయల్ రోల్ కోలీవుడ్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అందిస్తుంది. ఐతే తెలుగు వెర్షన్ కి మాత్రం ఆ బజ్ రాలేదు. అదీగాక స్క్రీన్ ప్లే విషయంలో ప్రేక్షకులు అసంతృప్తిగా ఉన్నారు. ఇదిలా ఉంటే గోట్ సినిమా చివర్లో ట్విస్ట్ ఇస్తూ గోట్ సీక్వెల్ కూడా ప్రకటించారు.

ఈమధ్య సినిమాలన్నీ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నాయి. కొన్ని సినిమాలు ముందుగానే రెండు భాగాలుగా వస్తుంటే మరికొన్ని సినిమాలు మాత్రం సినిమా ఎండ్ కార్డ్ లో పార్ట్ 2 ఉంటుందని సర్ ప్రైజ్ చేస్తున్నారు. గోట్ సినిమా పూర్తయ్యాక ఒక సర్ ప్రైజ్ వీడియో ఫ్యాన్స్ కి షాక్ ఇస్తుంది. అందులో గోట్ వర్సెస్ ఓజీ అని ప్రస్తావిస్తారు. ఐతే ఓజీ అనే పేరు వినగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ గుర్తుకు రాక మానదు. ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి పాన్ ఇండియా లెవెల్ లో ఓజీ ట్రెండింగ్ లో ఉంది.

ఐతే విజయ్ గోట్ సినిమా సీక్వెల్ గా ఓజీ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఓజీ టైటిల్ ఆల్రెడీ పవన్ సినిమాకు పెట్టారనే చెప్పొచ్చు. ఐతే పవర్ స్టార్ ఓజీ బజ్ ని వాడుకుని విజయ్ గోట్ కి సీక్వెల్ కి గోట్ వర్సెస్ ఓజీ అని పెట్టారని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. ఓజీ అనే టైటిల్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కాబట్టే ఆ టైటిల్ తీసుకున్నారని అంటున్నారు.

వెంకట్ ప్రభు అండ్ టీం ఈ కామెంట్స్ కు ఎలాంటి ఆన్సర్ ఇస్తారో ఏమో కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ పరిశీలనలో ఉన్న OGని విజయ్ గోట్ సీక్వెల్ లో ప్రస్తావించడం పవర్ స్టార్ ఫ్యాన్స్ ని కూడా సర్ ప్రైజ్ చేస్తుంది. మరి పవర్ స్టార్ సినిమా బజ్ చూసే ఓజీ టైటిల్ తీసుకున్నారా లేదా వెంకట్ ప్రభుకి అంతకుముందే ఈ టైటిల్ పరిగణలో ఉందా అన్నది తెలియాల్సి ఉంది.