Begin typing your search above and press return to search.

దళపతి విజయ్... ఇది ఎనిమిదవ సారి!

ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై 200 కోట్లకి పైగా కలెక్షన్స్ ని 8 సార్లు అందుకున్న ఏకైక హీరోగా దళపతి విజయ్ ఉన్నాడు.

By:  Tupaki Desk   |   8 Sep 2024 5:30 AM GMT
దళపతి విజయ్... ఇది ఎనిమిదవ సారి!
X

సౌత్ ఇండియాలో అత్యధిక మార్కెట్ ఉన్న హీరోలలో ఇళయదళపతి విజయ్ ఒకరు. అతని సినిమాలపై 300 కోట్లకి పైగా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. విజయ్ కెరియర్ లో లియో సినిమాపై ఏకంగా 500 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన GOAT మూవీపైన కూడా 400 కోట్లకి పైగా వ్యాపారం జరిగింది. దీనిని బట్టి అతని మార్కెట్ స్టామినా ఏంటనేది చెప్పొచ్చు.

మాతృభాషలోనే అతని సినిమాలు ఈజీగా 200 కోట్ల కలెక్షన్స్ దాటేస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే తాజాగా రిలీజ్ అయిన GOAT మూవీ సినిమాకి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయిన కూడా సాలిడ్ కలెక్షన్స్ వస్తూ ఉండటం విశేషం. ముఖ్యంగా తమిళంలో ఈ సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయంట. మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని GOAT మూవీ అందుకుందంట.

200 కోట్ల క్లబ్ లో చేరడంతో విజయ్ మరో రేర్ ఫీట్ ని సాధించారు. ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై 200 కోట్లకి పైగా కలెక్షన్స్ ని 8 సార్లు అందుకున్న ఏకైక హీరోగా దళపతి విజయ్ ఉన్నాడు. 200 కోట్ల క్లబ్ లో ఇక ఏ ఇతర హీరోలు ఇన్ని సార్లు చేరలేదు. నిజంగా ఇది అరుదైన రికార్డ్ అని చెప్పొచ్చు. ఈ ఫీట్ బట్టి విజయ్ కి తమిళనాట ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పొచ్చు.

అయన చేసిన మెర్సల్, సర్కార్, బిగిల్, మాస్టర్, బీస్ట్, వారిసు, లియో సినిమాలు 200 కోట్ల మార్క్ కలెక్షన్స్ ని అందుకున్నాయి. ఇప్పుడు GOAT మూవీ 200 కోట్ల క్లబ్ లో చేరిన 8వ చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాగా ఎక్కువగా ఉంది. ఇప్పటికే తమిళంలో తప్ప మిగిలిన భాషలలో GOAT మూవీ కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయిపోయాయి.

ఇలాంటి పరిస్థితిలో వీకెండ్ తర్వాత సినిమా ఎంత వరకు పబ్లిక్ ని హోల్డ్ చేసి థియేటర్స్ కి రప్పించగలదు అనే దానిని బట్టి సక్సెస్ రేట్, కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. ఈ చిత్రంలో విజయ్ కి జోడీగా మీనాక్షి చౌదరి నటించింది. అలాగే ప్రశాంత్, స్నేహ, లైలా, ప్రభుదేవా, వైభవ్ లాంటి స్టార్ యాక్టర్స్ మూవీలో కీలక పాత్రలలో నటించారు.