Begin typing your search above and press return to search.

విజయ్ 69 : క్యాస్టింగ్ వేరే లెవెల్.. ల్యాండ్ మార్క్ అవుతుందా?

అయితే విజయ్ 69 మూవీ పూజా కార్యక్రమాలు నేడు జరిగిన విషయం తెలిసిందే. చెన్నైలో జరిగిన ఆ వేడుకకు ప్రధాన నటీనటులతో పాటు టెక్నీషియన్స్‌ హాజరై అంతా సందడి చేశారు.

By:  Tupaki Desk   |   4 Oct 2024 10:10 AM GMT
విజయ్ 69 : క్యాస్టింగ్ వేరే లెవెల్.. ల్యాండ్ మార్క్ అవుతుందా?
X

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్.. రీసెంట్ గా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The GOAT) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో కొత్త మూవీ(విజయ్ 69)ని అనౌన్స్ చేశారు. ఇప్పటికే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దళపతి.. తన కెరీర్ లో చివరగా ఒక మూవీ చేయనున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి ప్రవేశించి.. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవ్వనున్నారని సమాచారం.


అయితే విజయ్ 69 మూవీ పూజా కార్యక్రమాలు నేడు జరిగిన విషయం తెలిసిందే. చెన్నైలో జరిగిన ఆ వేడుకకు ప్రధాన నటీనటులతో పాటు టెక్నీషియన్స్‌ హాజరై అంతా సందడి చేశారు. ప్రముఖ కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై విభిన్నమైన కథతో భారీ స్థాయిలో దర్శకుడు హెచ్‌ వినోథ్ తెరకెక్కించనున్నారు. శనివారం నుంచే రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో మేకర్స్.. విజయ్ 69 కోసం భారీ క్యాస్టింగ్ ను రంగంలోకి దించేశారు.


షూటింగ్ మొదలు కాకముందే.. ఆడియన్స్ లో సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో గత కొద్ది రోజులుగా వినూత్న రీతిలో క్యాస్టింగ్ ను రివీల్ చేశారు మేకర్స్. రోజుకొక యాక్టర్ పేరును ప్రకటిస్తూ సినిమాపై మంచి అంచనాలు పెంచారు. మూవీలో హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజా హెగ్డేను ఎంపిక చేశారు మేకర్స్. బీస్ట్ మూవీ తర్వాత మరోసారి విజయ్, పూజ స్క్రీన్ చేసుకోనున్నారు.మలయాళ బ్యూటీ, ప్రేమలు ఫేమ్ మమితా బైజు సెకండ్ హీరోయిన్ గా నటించనున్నారు.


విలన్ గా బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ యాక్ట్ చేయనున్నారు. తన కెరీర్ లో రెండో తమిళ మూవీని ఆయన చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ తో పాటు నటుడు నరైన్ రంగంలోకి దించారు మేకర్స్. సీనియర్ హీరోయిన్ ప్రియమణి కీలక పాత్ర పోషించనున్నారు. అంతా అనుకున్నట్టు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కూడా మూవీలో భాగమేనని తెలిపారు మేకర్స్. మొత్తానికి.. విజయ్ 69 కోసం క్యాస్టింగ్ ను భారీ స్థాయిలో సెలెక్ట్ చేసుకున్నారు.


అయితే మేకర్స్.. మూవీ అనౌన్స్మెంట్ టైమ్ లో క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో టార్చ్ బేర‌ర్ ప‌ట్టుకున్న ఓ వ్య‌క్తి చేయిను చూపించారు. ప్ర‌జాస్వామ్యానికి ఆయన ఒక టార్చ్ బేర‌ర్ అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చారు. వచ్చే ఏడాది అక్టోబర్ నెలలో సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇండియన్ సినీ హిస్టరీలో ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచేలా హెచ్. వినోథ్ విజయ్ 69 మూవీని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.