Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో 69 లో సూప‌ర్ స్టార్ బ్యూటీ!

తాజాగా మంజు వారియ‌ర్ మ‌రో కొత్త ప్రాజెక్ట్ కి ప‌చ్చ‌జెండా ఊపింది.

By:  Tupaki Desk   |   30 Sep 2024 7:30 AM GMT
ఆ స్టార్ హీరో 69 లో సూప‌ర్ స్టార్ బ్యూటీ!
X

45 లోనూ మంజు వారియ‌ర్ `మ‌న‌సిలియో` పాట‌తో కుర్ర‌కారును ఊపేసిన సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డు ఎర్ర చీర‌లో న‌ల్ల‌టి క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని స్టెప్పులు వేస్తుంటే? కుర్రాళ్ల మ‌తిపోయింది. ప‌క్కనే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ ఉన్నా? ఆయ‌న్ని విస్మ‌రించి క‌ళ్ల‌న్నీ మంజు వారియ‌ర్ పెర్పార్మెన్స్ పైనే వెళ్లాయి? అంటే అతి శయోక్తి కాదు. `వెట్టేయాన్` రిలీజ్ కి ముందే ఆ పాట సంచ‌ల‌నంగా మారింది.

తాజాగా మంజు వారియ‌ర్ మ‌రో కొత్త ప్రాజెక్ట్ కి ప‌చ్చ‌జెండా ఊపింది. ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌థానాయ‌కుడిగా త‌న చివ‌రి చిత్రం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇది విజ‌య్ కి 69వ చిత్రం. దీన్ని ఖాకీ ద‌ర్శ‌కుడు హెచ్. వినోధ్ టేక‌ప్ చేస్తున్నాడు. ఈసినిమాలో మంజు వారియ‌ర్ ని ఓ కీల‌క పాత్ర‌కు ఎంపిక చేసిన‌ట్లు కోలీవుడ్ మీడియాలో జోరుగా ప్ర‌చారం సాగుతోంది. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని స‌మాచారం.

ఇదే నిజ‌మైతే మంజు వారియ‌ర్ సినిమాకి అద‌న‌పు అస్సెట్ గా చెప్పొచ్చు. ఈలోపు `వెట్టేయాన్` మంచి విజ‌యం సాధించాలి. దీంతో మంజు వారియ‌ర్ క్రేజ్ మ‌రింత రెట్టింపు అవుతుంది. ఈ సినిమా అక్టోబ‌ర్ లో రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ 69వ చిత్రం కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వాలి. ఆయ‌న గ‌త సినిమా గోట్ భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయినా అన్నిచోట్లా మంచి విజ‌యం సాధించ‌లేదు.

కోలీవుడ్ లో యావ‌రేజ్ గా ఆడింది. దీంతో విజ‌య్ కది అసంతృప్తినే మిగిల్చింది. దీంతో 69వ సినిమాతో హిట్ కొట్టి త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో కాలు మోపాల‌ని చూస్తున్నారు. హిట్ వ‌చ్చిన కిక్ లో రెట్టించిన ఉత్సాహంతోనే ప్ర‌జ‌ల్లోకి వెళ్తారు.