Begin typing your search above and press return to search.

ఆ భామ‌కు పిలిచి మ‌రీ ఛాన్స్ ఇచ్చిన హీరో!

త‌ల‌ప‌తి విజ‌య్ 69వ చిత్రం `జ‌న నాయ‌గ‌న్` హెచ్. వినోధ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయ నేప‌థ్యంగ‌ల చిత్ర‌మిది.

By:  Tupaki Desk   |   28 Feb 2025 7:30 AM GMT
ఆ భామ‌కు పిలిచి మ‌రీ ఛాన్స్ ఇచ్చిన హీరో!
X

త‌ల‌ప‌తి విజ‌య్ 69వ చిత్రం `జ‌న నాయ‌గ‌న్` హెచ్. వినోధ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయ నేప‌థ్యంగ‌ల చిత్ర‌మిది. విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీని దృష్టిని పెట్టుకుని చేస్తోన్న చిత్ర‌మిది. సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇప్ప‌టికే విజ‌య్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా ముంబై భామ పూజాహెగ్డేని తీసుకున్నారు.

విజ‌య్ తో సినిమా చేయ‌డం అమ్మ‌డికి రెండ‌వ సారి. తొలిసారి ఇద్ద‌రు క‌లిసి బీస్ట్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. దీన్ని నెల్స‌న్ దిలీప్ తెర‌కెక్కించాడు. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా ప్లాప్ అయింది. కానీ మ్యూజికల్ గా బాగా క‌నెక్ట్ అయింది. అర‌బిక్ సాంగ్ తో విజ‌య్-పూజాహెగ్డే జోడీ ప్రేక్ష‌కుల్ని ఊపేసారు. అయితే ఇప్పుడు `జ‌న నాయ‌గ‌న్` లో పూజాహెగ్డేని తీసుకోవ‌డం వెనుక అస‌లు కార‌కుడు విజ‌య్ అని కోలీవుడ్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగ‌తోంది.

ఆయ‌న రిక‌మండీష‌న్ మేర‌కే వినోద్ బుట్ట‌బొమ్మ‌ని తీసుకున్నాడని అంటున్నారు. తొలుత ఈ పాత్ర కోసం సౌత్ న‌టి అయితే బాగుటుంద‌ని వినోద్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న తార‌ను తీసుకోవాల‌నుకున్నారట‌. ఈ విష‌యాన్ని విజ‌య్ కి కూడా చెప్ప‌డంతో ఆయ‌న కూడా తొలుత సానుకూలంగా స్పందించారట‌. ఈ క్ర‌మంలోనే న‌య‌న‌తారను అప్రోచ్ అవ్వ‌డం మొద‌లు పెట్టారట వినోద్.

ఆ ప్రోస‌స్ జ‌రుగుతుండ‌గానే విజ‌య్ ...వినోద్ ని పిలిచి న‌య‌న్ కంటే పూజాహెగ్డే అయితే బాగుంటుంద‌ని సూచించాడట‌. దీంతో వినోద్ హీరో మాట కాద‌న‌లేక పూజాహెగ్డేని ఫైన‌ల్ చేసిన‌ట్లు తెలుస్తోంది. హీరోయిన్ విష‌యంలో హీరో ఛాన్స్ తీసుకున్నాడంటే? అందుకు డైర‌క్ట‌ర్ అడ్డు చెప్ప‌డం అన్న‌ది దాదాపు అసాధ్యం. ఈ రూల్ టాలీవుడ్ కి కూడా వ‌ర్తిస్తున్న‌దే.