Begin typing your search above and press return to search.

దళపతి మెచ్చిన మహారాజ..!

యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన మహారాజ సినిమా డిజిటల్ రిలీజ్ తర్వాత సినిమా గురించి సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతుంది.

By:  Tupaki Desk   |   19 July 2024 10:26 AM GMT
దళపతి మెచ్చిన మహారాజ..!
X

కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి రీసెంట్ మూవీ మహారాజ అటు థియేటర్ లో సూపర్ సక్సెస్ అవ్వగా రీసెంట్ గా ఇది డిజిటల్ రిలీజై అక్కడ కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. మహారాజ తో మరోసారి తన స్టోరీ సెలక్షన్ తో సూపర్ అనిపించుకున్నాడు విజయ్ సేతుపతి. సినిమాను నిథిలన్ స్వామినాథన్ డైరెక్ట్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన మహారాజ సినిమా డిజిటల్ రిలీజ్ తర్వాత సినిమా గురించి సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతుంది.

ఇక ఈ క్రమంలో సినిమాను కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కూడా చూశారట. చూడటమే కాదు డైరెక్టర్ ని పిలిచి ప్రశంసించారని తెలుస్తుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ నిథిలన్ తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. సినిమాను విజయ్ అన్న చూసి మెచ్చుకోవడమే కాదు సినిమాలో ప్రతి చిన్న విషయాన్ని కూడా గుర్తుంచుకుని చర్చించారు. విజయ్ అన్నా మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు చూపించిన ప్రేమ ఇచ్చిన సపోర్ట్ కి ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చాడు డైరెక్టర్ నిథిలన్.

మక్కల్ సెల్వన్ 50వ సినిమాగా వచ్చిన మహారాజ 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. సినిమా ఫుల్ రన్ లో 100 కోట్ల పైన కలెక్ట్ చేసింది. సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయగా ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది. కంటెంట్ ఉన్న సినిమాలు తెలుగులో కచ్చితంగా ఆడతాయని మాహారాజ మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా సినిమాలో ఉన్న కంటెంట్ సూపర్ హిట్ చేసింది.

విజయ్ సేతుపతికి తెలుగులో కూడా సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. అంతకుముందు ఆయన తెలుగులో సైరా నరసింహారెడ్డి లో నటించారు. అదే కాదు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాలో శేషారాయణం పాత్రలో అదరగొట్టారు. ఈమధ్య కోలీవుడ్ లో ఆయన ఎక్కువగా విలన్ రోల్స్ చేస్తున్నారు. మాహారాజ తో మళ్లీ ఆయన సోలో సినిమాలు చేయడం మొదలు పెట్టారు. సో మహారాజ సక్సెస్ విజయ్ సేతుపతికి మళ్లీ కెరీర్ లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. విజయ్ సేతుపతి సౌత్ లోనే కాదు ఈమధ్యనే బాలీవుడ్ లో కూడా మెర్రీ క్రిస్మస్ అనే సినిమా చేశాడు. బాలీవుడ్ నుంచి ఎక్కువగా విలన్ ఆఫర్లు వస్తుండటం వల్ల వాటిని కాదంటున్నారు విజయ్