Begin typing your search above and press return to search.

అభిమానితో స్టార్ హీరో ప్రేమ‌క‌థ మీకు తెలుసా?

సౌతిండియా సూపర్‌స్టార్లలో ద‌ళ‌పతి విజయ్ స్టార్ డ‌మ్ అసాధార‌ణ‌మైన‌ది. నేడు దేశంలోని పాన్ ఇండియా స్టార్ల‌లో అత‌డు టాప్ 10లో ఉన్నాడు

By:  Tupaki Desk   |   27 Jun 2024 2:45 AM GMT
అభిమానితో స్టార్ హీరో ప్రేమ‌క‌థ మీకు తెలుసా?
X

సౌతిండియా సూపర్‌స్టార్లలో ద‌ళ‌పతి విజయ్ స్టార్ డ‌మ్ అసాధార‌ణ‌మైన‌ది. నేడు దేశంలోని పాన్ ఇండియా స్టార్ల‌లో అత‌డు టాప్ 10లో ఉన్నాడు. ద‌ళ‌ప‌తిగా ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిన విజ‌య్ తన అసాధారణమైన నటన, డాషింగ్ లుక్స్‌తో భారీ మాస్ ఫాలోయింగ్ సంపాదించాడు. అయితే అత‌డు వృత్తిగ‌తంగా వేరు.. వ్య‌క్తిగ‌తంగా వేరు.. ! కుటుంబానికి అత‌డు ప‌బ్లిసిటీ కోరుకోడు. చాలా సంవత్సరాలుగా పబ్లిక్ ఫిగర్ అయినా కానీ.. ద‌ళ‌పతి తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించాడు. అత‌డికి ఎన్నారై సంగీత సోర్నలింగంతో పెళ్లయి రెండు దశాబ్దాలకు పైగా అయ్యింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.. కుమారుడు జాసన్ సంజయ్, దివ్య సాషా అనే కుమార్తె ఉన్నారు.

అయితే విజయ్- సంగీత ఎలా కలుసుకున్నారు? వారి వివాహానికి దారితీసిన విషయాలు ఏంటో మీకు తెలుసా? నిజానికి ఈ జంట ప్రేమ‌క‌థ ఓ సినిమా క‌థ‌ను త‌ల‌పిస్తుంద‌నే విష‌యం మీకు తెలుసా? ఈ జంట మొద‌టి క‌ల‌యిక నుంచి ఆ త‌ర్వాత పెళ్లి వ‌ర‌కూ ఏం జ‌రిగిందో తెలిస్తే ఆశ్చ‌ర్యం క‌లగ‌క మాన‌దు. ద‌ళ‌పతి విజయ్ మొదటి బ్లాక్ బస్టర్ చిత్రం `పూవే ఉనక్కగా` అత‌డికి గొప్ప‌ కీర్తి, గుర్తింపును తీసుకురావడమే కాకుండా అతడి ఆత్మ సహచరిని కలవడానికి కారణమైంది. సంగీత ప్రాథమికంగా త‌న‌కు కాబోయే భర్త విజ‌య్‌కి గొప్ప అభిమాని. ద‌ళ‌పతి విజయ్ చెన్నైలోని ఫిల్మ్ సిటీలో సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు లండన్ నుండి త‌న‌ను చూడటానికి వచ్చిన ఒక అందమైన యువతిని కలుసుకున్నాడు. ఆ అంద‌మైన యువ‌తి- సంగీత.

విజయ్ గత సినిమా విజయం సాధించినందుకు అత‌డిని అభినందించాలని సంగీత‌ భావించిందట‌. సంగీత సోర్నలింగం UK లో స్థిరపడిన శ్రీలంకకు చెందిన తమిళ పారిశ్రామికవేత్త కుమార్తె. ఆ స‌మ‌యంలో ఆ ఇద్ద‌రూ నేరుగా ఒకరినొకరు కలుసుకుని కాసేపు ఆహ్లాదంగా మాట్లాడుకున్నారు. సంగీతతో ఈ మధురమైన జ్ఞాప‌కానికి ముగ్ధుడై ఏకంగా ఆమెను తన ఇంటికి ఆహ్వానించి, తన తల్లిదండ్రులను కలుసుకునేలా చేసాడు విజ‌య్. నెమ్మ‌దిగా తన లేడీ ల‌వ్ పై ప్రేమ‌ భావాలను పెంచుకున్నాడు. సంగీత కూడా అత‌డి ఇంటికి సమీపంలో నివసిస్తున్నందున విజయ్ మ‌ళ్లీ మ‌ళ్లీ ఆమెను తన ఇంటికి ఆహ్వానించాడు. ఈసారి అత‌డి తల్లిదండ్రులు చొరవ తీసుకున్నారు. సోర్న‌లింగాన్ని ప్ర‌శ్నించారు. విజయ్‌ని వివాహం చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? అని అడిగారు. ఆమె ప్రతిపాదనను అంగీకరించింది. ఆ త‌ర్వాత‌ మిగిలిన చరిత్ర గురించి అంద‌రికీ తెలుసు.

సంగీత-విజయ్ పెళ్లిని ధృవీకరించిన తర్వాత వారి తల్లిదండ్రులు చంద్రశేఖర్ - శోభ... సంగీత తల్లిదండ్రులను కలవడానికి లండన్ వెళ్లారు. రెండు కుటుంబాలు ఒకరినొకరు కలుసుకున్నాయి. సంగీత తల్లిదండ్రులు కూడా విజయ్‌ని తమ అల్లుడిగా అంగీకరించారు. చివరగా ఈ జంట 25 ఆగస్టు 1999న కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకున్నారు. విభిన్న మతాలకు చెందిన వారు అయినప్పటికీ ఈ జంట హిందూ వివాహ సాంప్ర‌దాయంలో పెళ్లాడారు. విజయ్ క్రిస్టియన్, సంగీత హిందువు .. వ‌ధువు సాంప్ర‌దాయాన్ని విజ‌య్ అనుస‌రించాడు. ఆ తర్వాత చెన్నైలో రిసెప్షన్ కూడా జరిగింది. విజయ్ - సంగీత డ్రీమ్ వెడ్డింగ్ ఇప్పటికీ భారతీయ చలనచిత్ర ప‌రిశ్ర‌మ‌లో మరపురాని వివాహాలలో ఒకటిగా నిలిచింది. వారి పెళ్లి తర్వాత ద‌ళ‌పతి విజయ్- సంగీత 2000లో మొదటిసారిగా పేరెంట్‌హుడ్‌ని స్వీకరించారు. 2005లో వారి రెండవ బిడ్డను స్వాగతించారు. పిల్లలిద్దరూ వరుసగా వెట్టైకారన్ , తేరి వంటి చిత్రాలలో తమ తండ్రితో కలిసి తెరపై కనిపించారు.

విడాకుల పుకార్లు వినాల్సొచ్చింది:

అయితే విజయ్- సంగీత ఇద్దరిపైనా పుకార్లు వ‌చ్చాయి. ఈ జంట విడాకులు తీసుకోవడంపై ఊహాగానాలు విపరీతంగా సాగాయి. 2023లో `వారిసు` ఆడియో లాంచ్‌లో అలాగే ప్రియా అట్లీ బేబీ షవర్ వేడుక‌లో సంగీత కనిపించకపోవటంతో ఇంటర్నెట్ లో ఇలాంటి నెగెటివ్ వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఈ జంట న‌డుమ ఏదో జ‌రుగుతోంద‌ని ప్ర‌చార‌మైంది. అయితే అవ‌న్నీ పుకార్లు మాత్ర‌మేన‌ని కూడా నిరూపిత‌మైంది.