Begin typing your search above and press return to search.

ద‌ళ‌ప‌తి విజ‌య్ 6వ సారి ద్విపాత్రాభిన‌యం?

ద్విపాత్ర‌లతో అద‌ర‌గొట్ట‌డంలో ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ కి ప్ర‌త్యేకించి ట్రాక్ రికార్డ్ ఉంది.

By:  Tupaki Desk   |   18 Aug 2023 5:50 AM GMT
ద‌ళ‌ప‌తి విజ‌య్ 6వ సారి ద్విపాత్రాభిన‌యం?
X

ద్విపాత్ర‌లతో అద‌ర‌గొట్ట‌డంలో ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ కి ప్ర‌త్యేకించి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్ప‌టికే ఐదుసార్లు ఆయ‌న పెద్ద తెర‌పై ద్విపాత్ర‌ల‌తో అల‌రించారు. ఇప్పుడు ఆరోసారి ద్విపాత్ర‌ల్లో న‌టించేందుకు రెడీ అవుతున్నార‌నేది కోలీవుడ్ టాక్‌. లియో త‌ర్వాత న‌టించే త‌దుప‌రి చిత్రంలో విజయ్ రెండు పాత్ర‌లతో ఫ్యాన్స్ కి స్పెష‌ల్ ట్రీట్ ఇవ్వ‌నున్నాడ‌ని తెలుస్తోంది.

2023 ద‌స‌రా కానుక‌గా లియో విడుద‌ల‌వుతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ పై ఇప్ప‌టికే భారీ అంచనాలు ఉన్నాయి. విజ‌య్ కెరీర్ లోనే బెస్ట్ బిజినెస్ ఈ సినిమాకి జ‌రుగుతోంది. నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ లో త‌మిళ‌నాడులోనే ది బెస్ట్ అని నిరూపించాడు విజ‌య్. థియేట్రిక‌ల్ గాను లియో బిజినెస్ ఆకాశ‌మే హ‌ద్దుగా ఉంద‌ని చెబుతున్నారు. లోకేష్ క‌న‌గ‌రాజ్ తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద‌ళ‌ప‌తి ఓ సినిమాలో న‌టించ‌నున్నాడు. ఈ ప్రాజెక్ట్ విజయ్ 68వ చిత్రం. తాజాగా ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇప్పటి వరకు కత్తి- బిగిల్ క‌లుపుకుని మొత్తం ఐదు చిత్రాలలో ద్విపాత్రాభినయం చేశాడు. ఇప్పుడు ఆరోసారి ద్విపాత్రాభిన‌యానికి రెడీ అవుతున్నాడు. ఇదే నిజమైతే అభిమానులకు పండుగే అవుతుంది.

టి-సిరీస్ ఇప్పటికే ఈ చిత్రం ఆడియో హక్కుల కోసం భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లు క‌థ‌నాలొస్తున్నాయి. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కళాపతి, కళాపతి ఎస్ అఘోరమ్, కళాపతి ఎస్ గణేష్, కళాపతి ఎస్ సురేష్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఏజీఎస్ లో ఇది 25వ చిత్రం. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.