దళపతి విజయ్ నికర ఆస్తుల విలువ?
దక్షిణాది సినీపరిశ్రమలో బిగ్గెస్ట్ స్టార్స్‌లో దళపతి విజయ్ ఒకరు.
By: Tupaki Desk | 24 Jun 2024 2:00 AM GMTదక్షిణాది సినీపరిశ్రమలో బిగ్గెస్ట్ స్టార్స్‌లో దళపతి విజయ్ ఒకరు. 1984లో పదేళ్ల వయసులో తన తండ్రి SA చంద్రశేఖర్ సినిమా `వెట్రి`తో బాల నటుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించాడు. బాల నటుడిగా రజనీకాంత్‌తో పాటు `నాన్ సిగప్పు మనితన్` సహా దాదాపు ఏడు చిత్రాలలో కనిపించాడు. 18 సంవత్సరాల వయస్సులో విజయ్ తన మొదటి ప్రధాన పాత్రను `నాలయ్య థెరపీ`లో చేశాడు. అటుపై విక్రమన్-దర్శకత్వం వహించిన పూవే ఉనక్కగా అతడికి పేరు తెచ్చింది. అతడికి ప్రజల్లో ఆదరణ క్రమేణా పెరిగింది. మిగిలిన చరిత్ర గురించి చెప్పాల్సిన పనిలేదు. నేడు 300 కోట్లు సునాయాసంగా వసూలు చేసే పాన్ ఇండియా స్టార్ గా అతడు వెలిగిపోతున్నాడు.
రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న విజయ్‌కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. దళపతికి అంతర్జాతీయ స్థాయిలో అభిమానులున్నారు. భారతదేశంలో అత్యంత పాపులర్ నటులలో ఒకడు. అల్లు అర్జున్ కాకుండా కేరళలో కూడా పెద్ద సంఖ్యలో అభిమానులను కలిగి ఉన్న ఏకైక మలయాళీయేతర నటుడు విజయ్ మాత్రమే. అతడు తమిళనాడులోని అతిపెద్ద బాక్సాఫీస్ కింగ్. విజయ్ నటించిన థ్రిల్లర్ చిత్రం `తేరి` కేరళలోను చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఇది చాలా మలయాళ చిత్రాల వసూళ్లను అధిగమించగలిగింది.
విజయ్ నటన, డ్యాన్సింగ్ సామర్ధ్యాలు అతడికి ఇంతటి ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టాయి. అతడి స్థిరమైన అభిమానుల బలం స్టార్ డమ్ ని పెంచుతూనే ఉంది. అయితే విజయ్ భారతీయ సినీపరిశ్రమలో అత్యంత ధనవంతుడు అనే సంగతి ఎందరికి తెలుసు? దాదాపు 445 కోట్ల నికర ఆస్తులు సహా ఇతర స్థిరాస్తులను విజయ్ కలిగి ఉన్నాడు. ప్రఖ్యాత GQ ప్రకారం 2023 నాటికి విజయ్ నికర ఆస్తుల విలువ $56 మిలియన్లు (రూ. 445 కోట్లు). విజయ్ సంవత్సరానికి 120 నుండి 150 కోట్ల వరకు సంపాదిస్తాడు. ఏడాది కాలంగా అతడు మూడు సినిమాలకు సంతకాలు చేసాడు. ఇప్పుడు అతడి ఆదాయం 500 కోట్ల మార్క్ ని టచ్ చేసి ఉంటుందని అంచనా. ఇక విజయ్ ఆస్తుల మార్కెట్ విలువను పరిగణిస్తే అది ఇంకా పెద్ద మొత్తంలో ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
విజయ్ ఒక్కో చిత్రానికి పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకుంటాడు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన బీస్ట్ కోసం అతడు 100 కోట్లు వసూలు చేశాడు. ఆ తరువాత జనవరి 11 న విడుదలైన తన చిత్రం `వారిసు` కోసం 150 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నాడని ప్రచారమైంది. నిర్మాతలు పెట్టుబడిదారులు విజయ్‌పై పెద్ద మొత్తంలో డబ్బును రిస్క్ చేయడానికి ఎల్లపుడూ సిద్ధంగా ఉన్నారు.
విజయ్ తన భార్య సంగీత సోర్నలింగం.. వారి ఇద్దరు పిల్లలు జాసన్ సంజయ్, దివ్య షాషాతో కలిసి సముద్ర తీర బంగ్లాలో నివసిస్తున్నాడు. అతడి నివాసం చెన్నైలోని నీలంకరై పరిసరాల్లోని క్యాజురినా డ్రైవ్‌లో ఉంది. విజయ్ ఇల్లు హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ బీచ్ హౌస్ నుండి ప్రేరణ పొందింది. యునైటెడ్ స్టేట్స్ పర్యటనలో విజయ్ టామ్ క్రూజ్ బీచ్ హౌస్ చూశాడు. విజయ్ కి అది ఎంతగానో నచ్చింది. అతడు ఒక చిత్రాన్ని తీశాడు.. అలాంటి బీచ్ హౌస్‌ను మళ్లీ సృష్టించాడు. విజయ్ ఇంటి వెలుపలి భాగం సహజంగా తెల్లగా ఉంటుంది. క్లాసీగా కనిపిస్తుంది.
ఆదాయపు పన్ను శాఖ 5ఫిబ్రవరి 2020న విజయ్ చెన్నై నివాసంపై దాడి చేసింది. అతడు ప్రొడక్షన్ స్టూడియో AGS ఎంటర్‌టైన్‌మెంట్ నుండి వారసత్వంగా పొందిన స్థిరాస్తులలో అతడి పెట్టుబడిని గుర్తించి పన్ను ఎగవేత గురించి ఆరా తీసింది. మార్చి 12న జరిగిన దాడిలో చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ కనిపించలేదని అధికారులు తెలిపారు.