Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్‌ మూవీలో టైమ్ ట్రావెల్‌ నిజమేనా...?

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ తన రాజకీయ అరంగేట్రంను ప్రకటించిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   22 Jun 2024 6:00 AM GMT
సూపర్ స్టార్‌ మూవీలో టైమ్ ట్రావెల్‌ నిజమేనా...?
X

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ తన రాజకీయ అరంగేట్రంను ప్రకటించిన విషయం తెల్సిందే. మెల్ల మెల్లగా రాజకీయాలతో బిజీ అవ్వబోతున్న విజయ్ ప్రస్తుతం చేస్తున్న గోట్‌(ది గ్రేటెస్ట్‌ ఆఫ్ ఆల్‌ టైం) సినిమా చివరిది అయ్యి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.

విజయ్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా గోట్‌ సినిమా వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో సినిమాకు సంబంధించిన పలు విషయాలు ఆసక్తికరంగా మారాయి. దర్శకుడు వెంకట్‌ ప్రభు ఈ సినిమాలో టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్ ను చూపించబోతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతుంది.

ఈ మధ్య కాలంలో టైమ్ ట్రావెల్‌ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఇలాంటి సమయంలో విజయ్ గోట్ సినిమాలో కూడా టైమ్‌ ట్రావెల్‌ ఉంటే ఖచ్చితంగా సూపర్‌ హిట్‌ అవ్వడం ఖాయం అంటూ ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా లో 2050 కాలం నాటి సన్నివేశాలు కొన్ని ఉండబోతున్నాయని ఇటీవల విడుదల అయిన గ్లిమ్స్ ను చూస్తే అర్థం అవుతుంది. ఇప్పటి వరకు మేకర్స్ టైమ్ ట్రావెల్‌ అనే కాన్సెప్ట్‌ గురించి ఎక్కడ కనీసం చిన్న ప్రకటన కూడా చేయలేదు. కానీ 2050 టైమ్‌ ను చూపించబోతున్నారు అనేది కన్ఫర్మ్‌.

చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ విషయాన్ని చివరి వరకు సస్పెన్స్‌ గా ఉంచాలని భావిస్తున్నారా లేదంటే సినిమా క్లైమాక్స్ లో కొన్ని నిమిషాల పాటు 2050 టైమ్‌ లో సినిమాను చూపించబోతున్నారా అనేది తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్‌ చేయాల్సిందే.