Begin typing your search above and press return to search.

విజయ్.. ఒకటి కాదు మూడు!

ఇళయదళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ GOAT.

By:  Tupaki Desk   |   30 May 2024 4:41 AM GMT
విజయ్.. ఒకటి కాదు మూడు!
X

ఇళయదళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ GOAT. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది ఈ టైటిల్ మీనింగ్. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే పనిలో ఉన్నారు. మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో విజయ్ కి జోడీగా కనిపించబోతోందంట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని ఇప్పటికే స్పష్టత వచ్చింది.

ఇందులో ఒక క్యారెక్టర్ లో టీనేజ్ యువకుడిగా కూడా విజయ్ ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ కోసం సరికొత్త టెక్నాలజీ ఉపయోగించి లుక్స్ పరంగా వేరియేషన్ తీసుకొచ్చారంట. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ మూవీ రెడీ అవుతోంది. దళపతి విజయ్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని GOAT మూవీ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ చిత్రంలో మరో ఆసక్తికరమైన పాత్రలో కూడా విజయ్ కనిపించబోతున్నాడంట. ఈ క్యారెక్టర్ ని రివీల్ చేయకుండా ప్రేక్షకులకి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం దర్శకుడు వెంకట్ ప్రభు సీక్రెట్ గా ఉంచారంట. మూవీలో ఆ రోల్ కి చాలా ప్రత్యేకత ఉంటుందంట. ఈ న్యూస్ బట్టి GOAT లో దళపతి విజయ్ నుంచి ట్రిపుల్ ట్రీట్ ప్రేక్షకులకి అందనుందనే మాట వినిపిస్తోంది.

అంటే మూడు విభిన్నమైన లుక్స్ తో విజయ్ ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే GOAT మూవీ రిలీజ్ కానుంది. దీని తర్వాత విజయ్ మరొక్క సినిమా మాత్రమే చేయనున్నాడు. ఇప్పటికే విజయ్ రాజకీయ పార్టీని స్థాపించి తమిళ రాజకీయాలలో కీలక భూమిక పోషించడానికి రెడీ అవుతున్నాడు. మరొక్క మూవీ కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో రాజకీయాలపై ఫోకస్ చేయనున్నారు.

రెండేళ్ల తర్వాత తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రెడీ అవుతున్నారు. రాజకీయాలలోకి రావడంతో సినిమాలు పూర్తిగా మానేస్తున్నట్లు విజయ్ ప్రకటించాడు. ఈ కారణంగానే GOAT మూవీపైన ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. GOATతో పాటు రాబోయే సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఫ్యాన్స్ కి గొప్ప ట్రీట్ లా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. డైరెక్టర్ వెంకట్ ప్రభు చివరిగా తెలుగులో కస్టడీ మూవీతో డిజాస్టర్ అందుకున్నారు. అయితే తన స్టామినా ఏంటనేది GOAT మూవీతో మళ్ళీ చూపించుకోవాలని గట్టిగానే కష్టపడుతున్నారు.